అంత ఆతృత ఉంటే ఆపుకోండి : మంత్రి బొత్స సత్యనారాయణ

ఏపీలోని సినిమా టికెట్‌ రేట్లపై తమ ప్రభుత్వం వేసిన కమిటీతో చర్చిస్తోందని మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టికెట్ రేట్లు పెంచాలన్న ఆతృత ఉంటే సినిమా వాయిదా వేసుకోవచ్చు కదా అని అని బీమ్లా నాయక్ సినిమాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సినిమాకు మంచి చేయాలనే జగన్ ఆలోచనగా పేర్కొన్నారు. కొందరు వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని తెలిపారు.

టికెట్ల రేట్ల విధివిధానాలపై కమిటీని కూడా వేశామని, ఆ అంశం ఇంకా కొనసాగుతోందని తెలిపారు.  టికెట్లపై అర్థం లేని విమర్శలు చేసే వారు.. ప్రజల కోసం ఆలోచించాలని హితవు పలికారు. చట్టం ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. సినిమా పరిశ్రమ తరపున చిరంజీవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారని వివరించారు. అమరావతి ఉద్యమంపైనా బొత్స విమర్శలు సంధించారు.  రైతులు చేసేది ఉద్యమం కాదని.. రాజకీయ ఉద్యమమన్నారు. ఉద్యమాన్ని చంద్రబాబు వెనకుండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు. తెదేపా కార్యకర్తలు మాత్రమే అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు.

అయితే సినిమా టికెట్ల రేట్ల పెంపుపై ఏపీలో ప్రభుత్వ ఆంక్షలు కొనసాగుతున్నాయి. థియేటర్లకు అధికారులు నోటీసులు ఇస్తున్నారు. అయితే హాట్స్ ఆఫ్ టు కేసీఆర్ అంటూ విజయవాడలో పవన్ అభిమానులు భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో సినిమాలకు ఎలాంటి అడ్డంకులు లేవని, ఏపీ ప్రభుత్వం దురుద్ధేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల థియేటర్లను కూడా ధ్వంసం చేశారు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ విధానాలను తప్పు బడుతున్నాయి. టికెట్ల రేట్ల విషయాన్ని ప్రభుత్వం పరిష్కరిస్తుందా..లేదా అన్నది చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *