ప్రజల వినోదాన్ని బలహీనతగా మార్చుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు- బొత్సా
ఏపీ సినిమా టికెట్ల వ్యవహారంపై మంత్రి బోత్సా సత్యనారాయణ మరోసారి ఫైర్ అయ్యారు. ఇష్టానుసారం టికెట్ ధరలు పెంచి ప్రజల వినోదాన్ని బలహీనతగా మార్చుకోవాలని చూస్తే ఊరుకోమని అన్నారు. టికెట్ ధర రూ.500కు పెంచితే ఎంత సామాన్యులు ఎంత ఇబ్బంది పడతారో తెలేదా అంటూ ప్రశ్నించారు. టికెట్లను అడ్డగోలుగా పెంచడం సరికాదని.. ప్రభుత్వం ప్రజల కోసమే నిలబడుతుందని.. సినిమా టికెట్లపై జగన్ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుందని అన్నారు. థియేటర్ నిర్వహకులను ఏమైనా అభ్యంతరాలుంటే.. ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. ప్రతి ప్రాడక్ట్‌ను కచ్చితమైన ధర ఉన్నప్పుడు.. సినిమా టికెట్లకు ఎందుకు ఉండకూడదో చెప్పాలని నిలదీశారు.
మరోవైపు విజయనగరంలోని రామతీర్థం ఆలయ సంఘటనపై స్పందంచిన బొత్సా.. అశోక్ గజపతి అసత్యాలు చెప్తున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారమే ఆలయ శంకుస్థాపన జరిగిందని.. కార్యక్రమ వివరాలను తెలిపేందుకు వచ్చిన సిబ్బందిని అశోక్ దుర్భాషలాడారని.. ప్రోటోకాల్ ప్రకారం ఆయన పేరు పెట్టిన శిలాఫలకాన్ని కూడా చిందరవందర చేశారని వివరించారు. బాధ్యత గల ధర్మకర్త స్థానంలో ఉన్న అశోక్ గజపతి.. ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కావాలనే జగన్‌పై అభియోగాలు మోపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా అబద్దాలు మాని.. సరైన దారిలో నడవాలని బొత్సా పేర్కొన్నారు.
ప్రస్తుతం ఏపీలో ఏం జరుగుతోందో అంతా గందరగోళంగా మారిపోయింది. ఓ వైపు ప్రతి పక్ష, అధికార పార్టీల మధ్య గొడవలుంటే.. మరోవైపు సినిమా థియేటర్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం చర్చ నడుస్తోంది. ఇలా చెలరేగిన వివాదాలు ఎన్ని రోజులకు సర్దుమనుగుతాయో కూడా తెలియడం లేదు.