నీకంటే అడుక్కున్నేవాళ్లు బెటర్.. వరుణ్ తేజ్ హీరోయిన్ పై ఫైర్?

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమా గురించి మనకు తెలిసిందే. ఇందులో వరుణ్ తేజ్ సరసన దిశా పటాని నటించిన విషయం కూడా తెలిసిందే. లోఫర్ సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అక్కడే మంచి మంచి సినిమాలు చేస్తూ హీరోగా సెటిల్ అయిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ పాపులారిటీని సంపాదించుకుంది.

ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె యాక్టింగ్ కు మాత్రమే కాకుండా ఈమె నటనకు, స్టైలిష్ డ్రెస్సింగ్ కు సైతం ఫ్యాన్స్ ఉన్నారు. ఈమె ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా స్టైలిష్ గా ఉన్న ఫ్యాషన్ దుస్తులను ధరిస్తూ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ధరించిన డ్రెస్సింగ్ విషయంలో ట్రోలింగ్స్ కి గురయింది ఈ బ్యూటీ.

ఇటీవల ఎయిర్ పోర్టులో మీడియా కంట పడింది. ఈ క్రమంలోనే ఆమె ధరించిన డ్రస్సు పై నెటిజన్స్ దారుణంగా ట్రోలింగ్స్ చేశారు. బ్రౌన్ టాప్, బ్లూ రిప్డ్ జీన్స్ వేసుకుని ఉంది. అయితే ఆ జీన్స్ ప్యాంటు కి హోల్స్ ఎక్కువగా ఉండడంతో ఆ ఫోటో పై నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అడుక్కునే వాళ్ళు కూడా ఇలా వేసుకోరు అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. పోకిరి లాగా కనిపిస్తున్నావు అని ఇంకొక నెటిజెన్ కామెంట్ చేశాడు. మరొక నెటిజెన్ వెటకారంగా ఎంత పేదవాళ్లు.. నా దేశానికి ఏమయింది. ఇలా చిరిగిన బట్టలు వేసుకుంటున్నారు అంటూ కామెంట్ చేసాడు. ఎందుకు ప్రతిసారీ ఇలా ఒళ్లంతా చూపిస్తారు అంటూ వరుసగా విమర్శలు గుప్పించారు నెటిజన్లు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *