నలుపు తగ్గించే టొమాటో..!

ముఖాన్ని అందంగా ఉంచుకునేందుకు చాలా మంది అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువగా ముడతలు, మచ్చలు, నలుపు వంటి వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుటారు. ఇందుకోసం చాలా డబ్బులే ఖర్చు చేస్తారు. అయితే ముఖంపై ట్యాన్ అంటే..పేరుకుపోయిన నలుపుతో ఇబ్బంది పడేవారు ఈ కింద సూచించిన ప్యాక్ లు ప్రయత్నిస్తే ఫలితం లభిస్తుంది. ఇంట్లోనే ఉండి జీరో బడ్జెట్ తో మీ ముఖంపై ఉన్న ట్యాన్ ను తొలగించే చిట్కా మీ కోసం. మంచి తాజాగా ఉన్న టమోటా తీసుకుని దాన్ని మధ్యలోకి కోయాలి. కోసిన ముక్కను పంచదారలో అద్దాలి.

అలా చక్కెర అద్దిన టమోటాపై పెరుగు వేయాలి. దాన్ని ముఖంపై రుద్దుకుంటే మృత కణాలు తొలిగిపోతాయి. ముఖంపై పేరుకుపోయిన నలుపు నెమ్మదిగా దూరమవుతుంది. ఒక ముక్క టమోటా రసం, ఒక చెక్క నిమ్మరసం, కొద్దిగా పెరుగూ కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. మరీ పల్చగా ఉందనుకుంటే శనగపిండి కానీ, ముల్తానీమట్టి కానీ కలిపి చిక్కగా కూడా చేసుకోవచ్చు. ఈ కలిపిన మిశ్రమాన్ని ముఖం, మెడ పంపుల్లో  ప్యాక్ లా రాసుకోవాలి.

ఇలా వారంలో రెండు సార్లు ప్యాక్ వేసుకుంటే ట్యాన్ తొలగిపోతుంది. చర్మం తాజాగా మారుతుంది. మొటిమల సమస్య కూడా తగ్గుతుంది.  ఒక ముక్క టమాటా రసానికి చెంచా కొత్తిమీర రసం కలపాలి. ప్యాక్ వేసుకోవాలంటే చిక్కగా ఉండాలి కాబట్టి అవసరం మేరకు ముల్తానీ మట్టి కలుపుకోవాలి. దీన్ని ముఖంపై ప్యాక్ వేసుకోవాలి. ఇలా ప్రతి వారానికి రెండు మూడు సార్లు వేసుకుంటే నలుపు తగ్గిపోతుది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *