2024లోనూ అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్

2024 సాధారణ ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు బీజేపీ రెడీ అవుతోంది. దీనికోసమే సీనియర్ నేతలతో ఆపార్టీ ఇప్పటి నుండే సమీక్షలు నిర్వహిస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంత్రి వర్గ నిర్మాణం కూడా ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రోజులు క్రితం వెలువడిన ఫిలితాల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయ దుందుబి మోగించింది. కానీ పంజాబ్ లో మాత్రం ఆమ్ ఆద్మీ విజయం సాధించింది.​ కానీ ఈ సారి 2024లో జరగబోయే జనరల్ఎ న్నికలపైనా ఇప్పుడే  దృష్టి పెట్టింది బీజేపీ.

ఆ దిశగానే రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు, కేబినెట్​ మార్పుపై పార్టీ అధిష్ఠానం ఆలోచనలు చేస్తోంది.రెండేళ్లలో రానున్న లోక్​సభ ఎన్నికల్లో గట్టున  పడేందుకు దేశ వ్యాప్తంగా పార్టీ పరిస్థితిపై పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తున్నట్లు తెలుస్తోంది. యూపీలో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చింది. మొదటి సారిగా ఒక పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చింది​. పార్టీ వర్గాల ప్రకారం ప్రస్తుతం బీజేపీ అధిష్ఠానం ఇటీవలి ఎన్నికలు, ముఖ్యంగా ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తోంది.

ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త మంత్రివర్గం కూర్పుపై వివిధ సమావేశాల్లో బలంగా సమీక్ష జరిపుతోంది. ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి, గెలుపు, వంటి మొత్తం అంశాలను డాక్యుమెంట్ రూపంలో మోడీ ముందు ఉంచారు ఆ పార్టీ నేతలు​. ఇక కొత్తగా ఏర్పాటు చేయబోయే సమావేశంలో ఎన్నికైన అభ్యర్థుల విద్యార్హతలు, ప్రత్యేకత, వారి కులం, మొదలైన అంశాలపై చర్చించారు. కొత్త కేబినెట్​లో అభ్యర్థుల విద్యార్హత, వయస్సుకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా కనిపిస్తోంది. ఏది ఏమైనా మూడో సారి కేంద్రంలో పాగా వేసేందుకు బీజేపీ నేతలు ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *