షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ లను నామినేట్ చేసిన బిగ్ బాస్ విన్నర్ సన్నీ… ఎందుకో తెలుసా

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు విజేతగా సన్నీ నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. మొదట రిపోర్టర్​గా కెరీర్​ మొదలుపెట్టిన సన్నీ… ఆ తర్వాత యాంకర్​గా ఎదిగి బిగ్​బాస్​ షోతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఈ క్రమంలోనే తొలుత సన్నీకి హౌస్​తో పాటు, ప్రజల్లో కాస్త నెగిటివిటీ వచ్చినా… మెల్లగా అతనిపై జనాల్లో క్రేజ్​ పెరగడం మొదలైంది. ఓటింగ్​ ప్రాసెస్​లో నెగ్గుతూ… చివరకు హౌస్​మేట్స్ అందర్నీ దాటుకుని విన్నర్​గా నిలిచాడు. అయితే ఇప్పుడు తాజాగా సన్నీ షణ్నూ, సిరిలతో పాటు సింగర్‌ శ్రీరామచంద్రను నామినేట్‌ చేశాడు.

bigg boss 5 winner sunny nominates other house mates for green india challenge

బిగ్‌బాస్‌ అయిపోయిన తర్వాత కూడా నామినేషన్స్ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా… మీరేం కంగారూ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది బిగ్ బాస్ నామినేషన్ కాదు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ నామినేషన్. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల‍్లి సంతోష్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ దిగ్విజయంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. . పర్యావరణాన్ని రక్షించే మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌లో ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

తాజాగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సన్నీ… బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు షణ్ముక్‌, సిరి, శ్రీరామచంద్రలకు ఛాలెంజ్‌ విసిరారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపాడు. కాగా నిన్న జరిగిన మీడియా సమావేశంలో సన్నీకి కరెంట్ సోక్క్ తగిలిన విషయం అందరికీ తెలిసిందే. అది చిన్నపాటి ఘటనే అయినప్పటికీ… సన్నీ ఫ్యాన్స్ మాత్రం ఆ వీడియోను సోషల్ ​మీడియాలో వైరల్​గా మార్చేశారు. ఇక మళ్ళీ ఈరోజు సన్నీ యాక్టివ్ గా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం పట్ల అతని అభిమానులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సన్నీకి సపోర్ట్ గా సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతూ ఈ వార్తను వైరల్ చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *