ఉల్లితో లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు అని తెలుసా…
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని పెద్దలు చెబుతుంటారు. ఉల్లిపాయలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఇవి శరీరంలోని అనేక వ్యాధులను నయం చేయడానికి సహాయపడుతాయి. ఉల్లిపాయ శరీరానికి మేలు చేసే ఆరోగ్య ప్రయోజనాలేంటో మనం తెలుసుకుందాం…
నిత్యం ఉపయోగించే కూరగాయల్లో ఉల్లిపాయ కూడా ఒకటి. ఉల్లిపాయ తింటే నోటి దుర్వాసన వస్తుందని చాలామంది తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఉల్లిపాయతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే అసలు తినకుండా వదిలిపెట్టరు. ఆర్థరైటిస్ నొప్పిలను తగ్గించే ఔషధంగా ఉల్లి రసం పనిచేస్తుంది. ఉల్లిరసంలో కొన్ని నువ్వుల గింజలు వేసి వేడి చేయాలి. ఈ ఉల్లిరసం గోరువెచ్చగా ఉన్నప్పుడు నొప్పులు ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే ఆర్థరైటిస్ నొప్పిల నుంచి విముక్తి కలుగుతుంది.
లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే ఉల్లిపాయ రసాన్ని, అల్లం రసాన్ని సరైన మోతాదులో కలిపి తాగితే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. కాలిన ప్రదేశంలో ఉల్లి రసాన్ని రాసుకుంటే కాలిన గాయాలకు చల్లదనాన్ని అందించి బొబ్బలను నిరోధిస్తుంది. అలానే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉల్లిరసం కాపాడుతుంది. దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల ఉన్నప్పుడు ఉల్లి, తేనె రెండింటినీ సమపాళ్ళలో తీసుకొని బాగా మిక్స్ చేయాలి ఆ మిశ్రమాన్ని తాగడంతో మంచి విముక్తి కలుగుతుంది. మూత్రకోశ వ్యాధులు, జాండీస్, జీర్ణాశయ సమస్యలను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందు వలన ఉల్లిపాయలను ఏదో ఒక రూపంలో నిత్యం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.