ఆ డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన బాలయ్య.. ఆ హీరోను ఆరు నెలల వరకు కలవద్దంటూ!

నందమూరి బాలయ్య గురించి తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలియని వారెవ్వరు లేరనే చెప్పాలి. ఎందుకంటే తన నటనతో, ఎనర్జీ తో ఎంతోమందిని అభిమానులుగా మార్చుకున్నాడు. రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బాలయ్య ఇప్పటికీ కూడా యంగ్ హీరోలతో పోటీగా దూసుకెళ్తున్నాడు.

కేవలం నటుడుగానే కాకుండా వ్యాఖ్యాతగా కూడా తనేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఓటీటీ వేదికగా ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలను, ప్రముఖులను ఆహ్వానించి వారిని ఇంటర్వ్యూ చేస్తూ తమ వ్యక్తిగత విషయాలను తెలుసుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ షోలో బాలయ్య డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. గోపీచంద్ మలినేని. ఈయనతో పాటు హీరో రవితేజ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఇక డైరెక్టర్.. రవితేజ ను క్రమం తప్పకుండా కలుస్తుంటానని.. ఈ షో రెండు రోజుల ముందు కూడా కలిశానని అన్నాడు.

వెంటనే బాలయ్య.. మీ మునుపటి సినిమా హీరోని అలా ఎందుకు కలవాలనుకుంటున్నారు? మీ కాబోయే హీరోని కలవండి. మీరు మరో బ్లాక్ బస్టర్ అందించొచ్చు అని అన్నాడు. అంతేకాకుండా వచ్చే ఆరు నెలలు రవితేజని కలవవద్దని.. ఆయనకు బదులు తనను కలవమని..

ఇద్దరం కలిసి బ్లాక్ బస్టర్ అందించిన తర్వాత రవితేజ ను కలవాలని సరదాగా వార్నింగ్ ఇచ్చాడు బాలయ్య. ఇక రవితేజ కూడా.. సార్ మీరు గోపీని నా దగ్గరకు పంపకండి.. నేను అతన్ని కలవడానికి మీ సెట్స్ కి వస్తానని అన్నాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *