తల్లి కోసం బంగారు నగలు కొన్న అషు రెడ్డి!

Ashu Reddy: అషు రెడ్డి.. ఈ పేరు నెటిజన్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డబ్ స్మాష్ ద్వారా ఫేమస్ అయ్యి, సోషల్ మీడియాలో ఓ స్టార్ పొజిషన్ పెంచుకొని.. బిగ్ బాస్ సీజన్ త్రీలో ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. ఇక ఈ బ్యూటీ అచ్చం సమంత అలా ఉండడమే ఈమెకు ప్రత్యేక గుర్తింపు అని చెప్పవచ్చు.

Ashu Reddy
Ashu Reddy

ఇక ఈ మధ్య మెహబూబ్ దిల్ సే తో కలిసి యూట్యూబ్ లో తెగ హడావిడి చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ బిగ్ బాస్ బ్యూటీ బంగారం కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ లో పంచుకుంది. బంగారాన్ని అలంకరించుకుంటూ మురిసిపోయింది.

అయితే ఆ నగలన్ని తన కోసం కాదని తన తల్లి కోసం అని చెప్పుకొచ్చింది. ఆ నగలు ప్యాక్ చేయించి తన తల్లికి కానుకగా ఇచ్చి ఆమెను సర్ప్రైజ్ చేసింది. తన కోసం బంగారు నగలు తీసుకొని రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆమె తల్లి. ఇదివరకు కొన్న గాజులకు ఇవి చాలా బాగా సెట్ అవుతాయి అని సంతోషపడింది. అషు కు ఇంత మంచి బుద్ధి ఎప్పుడు వచ్చింది అంటూ ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఓ సినిమాలో బిజీగా ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *