వాళ్లెవరైనా నా సోఫా కింద కానీ.. మోదీ సోఫా కిందగానీ ఉన్నారా? : సీఎం జగన్
తమ పాలన చూసి ఎల్లో పార్టీ భయపడుతోందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. నరసరావుపేటలో వాలంటీర్లకు చేసే సత్కారాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో టీడీపీ, జనసేనపై సీఎం అయ్యారు. మేనిఫెస్టో హామీలను 95 శాతం అమలు చేశామని, ఎల్లో పార్టీ కంటే మెరుగైన రీతిలో పాలన అందించామని ఎద్దేవా చేశారు. పళ్లు కాసే చెట్టుపైనే రాళ్లు ఎక్కువ పడతాయన్నారు. సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగితే ఎల్లో పార్టీ బాక్సులు బద్దలవుతాయని జోష్యం చెప్పారు. ఏపీ మరో శ్రీలంక కాబోతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
దొంగల ముఠా హైదరాబాద్లోల ఉంటూ మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పవన్నుబ దొంగల ముఠాగా జగన్ పేర్కొన్నారు. గతంలో దోచుకుని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని ఆరోపించారు. ప్రజలకు మంచి చేయకపోగా..మంచి చేస్తున్న ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లంతా మనుషుల రూపంలో ఉన్న దైయ్యాలని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ప్రధాని మోదీ నాకు క్లాస్ తీసుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
నేను, మోదీ మాత్రమే రూమ్లో్ ఉన్నామని, వాళ్లెవరైనా నా సోఫా కింద కానీ.. మోదీ సోఫా కిందగానీ ఉన్నారా? అని ప్రశ్నించారు. అంత అసూయ ఉంటే.. గుండెపోటు వస్తుందని, త్వరగా పైకి టికెట్ తీసుకుంటారని శాపనార్ధాలు పెట్టారు. ఇవాళ నేను మారీచులు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నానని, గతంలో ఇద్దరూ విడివిడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తారని అన్నారు. తమకు గిట్టని ప్రభుత్వం ఉంటే అందరూ ఏకమైపోతారని, విపక్షానికి నీతి, నిజాయితీ లేదన్నారు. వాళ్లంతా ఓ గజదొంగల ముఠా అని, వీరు చెప్పే మాటలు నమ్మవద్దని ప్రజలను వేడుకున్నారు.