ఆమె శాపం చంద్రబాబను నిలువునా కాల్చిపడేస్తుంది- కొడాలి

వైసీపీ మంత్రి కొడాలి నాని తాజాగా చంద్రబాబుపై  మాటలతూటాలు విసిరారు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఎవ్వరైనా రాజకీయాలు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఇంట్లో మహిళలను రోడ్డు మీదకు తెచ్చిన వారికి కచ్చితంగా ఆ దేవుడి శాపం తగులుతుందని అన్నారు. చంద్రబాబు సతీమణి భువణేశ్వరి అన్నట్లు.. తప్పు చేసిన వాళ్లకు కచ్చితంగా తగిన శిక్ష పడుతుందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కనీసం కొన్నైనా సీట్లొచ్చాయని.. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని చంద్రబాబును ఉద్దేశిస్తూ అన్నారు నాని.

ap-minister-kodali-nani-slams-chandrababu-naidu

తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడినఆయన.. రైతుల పంట కొనుగోలు విషయంపై స్పందించిన ఆయన.. ఎవరు ఎంత ధాన్యం ఇచ్చినా ప్రత గింజా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్బీకేల ద్వారా పనులు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. తడిచిన ధాన్యంతో సహా.. ప్రతి గింజను కొనాలని సీఎం చెప్పారన్నారు.

మరోవైపు స్టీల్ ప్లాంట్​ ప్రైవేటీకరణ గురించి కూడా మాట్లాడని ఆయన.. దాన్న ఆపాల్సిన బాధ్యత కేంద్రానిదని అన్నారు. పార్లమెంటులో ఎంపీలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తే ప్రైవేటీకరణ ఆగదని.. మేము చేయాల్సి చేస్తామని తెగేసి చెప్పారు. పవన్​కళ్యాన్​ను ఉద్దేశిస్తూ.. నీ దత్తత తండ్రి చంద్రబాబుకు మీ సలహాలివ్వండి.. మాకు కాదు.. అంటూ విరుచుకుపడ్డాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *