టాలీవుడ్ లో మరో జంట బ్రేక్ అప్.. షాకింగ్ లో అభిమానులు!

Tharun Bhasker: ఒకపక్క కోవిడ్ మరోపక్క సెలబ్రెటీల బ్రేక్ అప్స్.. ఈ రెండు అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీల బ్రేకప్ లు మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు, ప్రేమ జంటలు విడిపోతున్నారు అంటే తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే సమంత, నాగ చైతన్యలు విడిపోయి అందరికీ షాక్ ఇవ్వగా..

Tharun Bhasker
Tharun Bhasker

ఇప్పటికీ వారి మధ్య బ్రేకప్ ఊహించుకోలేక పోతున్నారు జనాలు. అంతలోనే సోషల్ మీడియా సెలబ్రెటీలు దీప్తి సునైనా, షణ్ముఖ్ కూడా తమ ఐదేళ్ల రిలేషన్ షిప్ కు బ్రేక్ అప్ చెప్పారు. ఇక ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య కూడా విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో జంట విడిపోయారు.

ఇంతకీ వారెవరో కాదు.. తరుణ్ భాస్కర్. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు. తొలిసారిగా పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అంతకు ముందు పలు సినిమాలకు రచయితగా, స్క్రీన్ ప్లే గా పని చేశాడు. కొన్ని సినిమాలకు నటుడుగా కూడా చేశాడు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ఇక ఈయన మరో సెలబ్రిటీ లత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లత పలు షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా చేసింది. తరుణ్ సినిమాలకు సంబంధించిన పలు ఈవెంట్లలో కూడా తాను కనిపించేది. అలాంటిది వీరు విడిపోయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇద్దరూ దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. కానీ ఈ విషయం గురించి తరుణ్ భాస్కర్ ఇప్పటి వరకు అధికారికంగా తెలపలేదు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *