మహిళల పుస్తెలు తెగిపడుతున్నా.. మద్యం నిషేధంలో జగన్​ పట్టనట్లు కూర్చున్నారు- అనిత

ఏపీ ప్రభుత్వం మధ్యం ధరలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. జగన్​ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.  మద్యపానం నియంత్రణ కోసం గత రెండున్నర్రేళ్లలో జగన్​ ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు అనిత. ప్రభుత్వం వైన్ షాపుల్లో చీప్​ లిక్కర్​ తాగుతూ.. గత రెండేళ్లుగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.  మూడు దశల్లో మధ్యపానం నిషేధిస్తామని హామీలు ఇచ్చిన జగన్​.. ఎందుకు మాట తప్పుతున్నారో ప్రజలకు వివరించాల్సి అవసరం ఉందన్నారు. మహిళల పుస్తెలు తెగిపడుతున్నా.. ప్రభుత్వం పట్టనట్లు కూర్చోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

మధ్యం ధరల్లో పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటున్న ప్రభుత్వం.. అభివృద్ది విషయంలో అదే పట్టుదల ఏమైందని ప్రశ్నించారు. మరోవైపు ఐఏఎస్​ అధికారులు మధ్యం అమ్మకాలు పెంచడంపై రివ్యూ ఇవ్వడం చాలా దురదృష్టకరమని.. ఇలాంటిది దేశంలో ఎక్కడా జరగలేదని అన్నారు. దేశమంతటా డిజిటల్​ సేవలు నడుస్తుంటే.. వైన్​ షాపు ముందు మాత్రం ఆన్​లైన్ పేమేంట్లు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. కేవలం ప్రజల నుంచి డబ్బులు కొల్లగొట్టేందుకే ఆన్​లైన్​ పేమెంట్లు పెట్టట్లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులతో పాటు, వాలంటీర్లు… గంజాయి, నాటుసారా అమ్మకాలు చేస్తున్నారంటూ అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల హామీలో జగన్​ మద్యం నిషేధిస్తానని చెప్పిన మాట వాస్తవమే.. కానీ, ప్రభుత్వంలోకి వచ్చాక.. మధ్యం రేట్లు పెంచి నిషేధంలో ఇదీ ఒక భాగమేనని అన్నారు.. కానీ, ఇప్పటికీ మధ్యం రేట్లు పెరిగినా కొనే వాళ్లు మాత్రం తగ్గట్లేదు. దానికి తోడు, ఉన్న బ్రాండ్లను తీసేసి.. ఏవేవో కొత్త బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది ప్రభుత్వం. వాటి ధరలు చూస్తేనే షాకైపోతున్నారు మధ్యం ప్రియులు. ఈ క్రమంలోనే పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించుకుంటున్నారు. దీన్ని అరికట్టేందుకే మద్యం రేట్లను తగ్గించింది ప్రభుత్వం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *