రక్త హీనత సమస్య – పరిష్కారం

సరైన పోషకాహారం శరీరానికి అందిచకపోవడం వల్ల రక్త హీనకు గురయ్యే అవకాశం ఉంది. మన దేశంలో సింహభాగం జనాభా ఈ రక్త హీనతతో బాధపడుతున్నారు.  రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువుగా ఉండటం వల్ల కూడా ఈ రక్త హీన వచ్చే అవకాశం ఉంటుంది. హిమో గ్లోబిన్ ఉత్పత్తి చేయాలంటే ఐరన్ పెంచాలి. రక్త హీనత వచ్చినప్పుడు గుండె స్పందన రేటు తగ్గవచ్చు పెరగవచ్చు. ఎంత గట్టిగా ఊపిరి పీల్చుకున్నా రక్తంలో ఆక్సీజన్ లేకపోవడాన్ని గమనించవచ్చు. పెదవులు, చిగుళ్లు, కను రెప్పల లోపల కనబడే ఎరుపు తగ్గుతుంది కూడా.

జుట్టు రాలిపోతుంది, కండరాల నొప్పులుగా ఉంటాయి, తలనొప్పి అధికమవడం, ఆందోళన, విశ్రాంతి లేకపోవడం, గోళ్లు వాడిపోవడం వంటికి రక్త హీనతకు లక్షణాలుగా కనబడతాయి. అయితే ఈ రక్త హీనత తగ్గించుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంది. దానికి తగ్గ సరైన ఆహారం తింటి రక్త హీనత నుండి బయటపడవచ్చు. పాలకూర, సోయాబిన్, గుడ్లు, చేపలు,  ఆకుకూర, నువ్వులు, బెల్లం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో ఐరన్ అధికంగా లభిస్తుంది.

ఎండిన పండ్లను కూడా తీసుకోవాలి. అల్బుకెర్కీ, నేరేడు పండ్లు, అత్తి పండ్లు, ద్రాక్షపండులను ఎండబెట్టుకుని తినాలి. బాదం పప్పును బాగా నానబెట్టుకుని కూడా తినాలి. ఒక గ్లాసు మోతాదులో దానిమ్మ రసం తాగాలి. దానిమ్మ రసం వల్ల కామెర్లు కూడా వచ్చే అవకాశాన్ని దూరం పెడుతుంది. పైన పేర్కొన్న ఆహార పదార్థాల్లో ఐరన్, పోషకాలు అధికంగా ఉంటాయి. రక్త హీనతతో బాధ పడేవారు ఈ రకమైన తిండి తీసుకుంటే దాని బారీ నుండి బయటపడవచ్చు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *