రిలీజ్‌కి ముందే ‘మేజర్’ సినిమా చూడొచ్చు.. ఎలాగంటే..!
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటన, అభినయంతో ప్రేక్షకులలో విపరీతమైన అభిమానాన్ని ఏర్పరచుకున్న నటుడు అడవి శేష్. టాలీవుడ్లో థ్రిల్లర్ కథలకు కెరాఫ్ అడ్రెస్‌గా శేష్ నిలిచాడు. లేటెస్ట్గా ఈయన నటించిన చిత్రం ‘మేజర్’. ముంబై బాంబు దాడుల్లో అమరవీరుడైన మేజర్ సందీప్ ఉన్నీ కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ‘గూఢచారి’ ఫేం శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించాడు. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నమోదు చేశాయి. యాక్షన్ థిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లను మొదలు పెట్టారు. తాజాగా ఈ చిత్రం నుంచి బిగ్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
దేశంలోని పలు నగరాల్లో ఈ సినిమాను ముందుగానే ప్రదర్శించనున్నట్లు తెలిపింది. 10 రోజుల ముందుగా 9 మేజర్ నగరాల్లో ప్రీ రిలీజ్ స్పెషల్ స్క్రీనింగ్‌లో ఈ సినిమాను ముందుగానే ప్రదర్శిస్తున్నారు. అన్ని ఏరియాల్లో ఒక్కసారి కాకుండా.. ఒక్కో నగరంలో ఒక్కో రోజు స్పెషల్ ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. పూణే, ముంబై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్, అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ, లక్నో నగరాల్లో మేజర్ సినిమాని ఈ నెల మే 24 నుంచి రోజుకి ఒకచోట ప్రదర్శించనున్నారు. అన్ని నగరాల్లో అయ్యాక జూన్ 3న దేశ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. మేజర్ సినిమా రిలీజ్ కంటే ముందే ఈ స్పెషల్ షో లో చూసేయాలి అంటే బుక్ మై షో యాప్ లో టికెట్లు బుక్ చేసుకోవాలి.
HERE it is!!! MASSIVE! For the FIRST TIME EVER!#MAJOR
X@bookmyshow pic.twitter.com/so2fTAx4Y6— Adivi Sesh (@AdiviSesh) May 23, 2022
ఇంత వరకు హాలీవుడ్ సినిమాలు విడుదలకు పది నుంచి నెల రోజుల ముందు ప్రివ్యూలను వేసి సినిమాపై బజ్‌ను క్రియేట్ చేస్తారు. ఇక హాలీవుడ్ సినిమాల స్ట్రాటజీను మేజర్ చిత్రం ఇండియాలో ప్రయోగం చేయనుంది. కాగా ఈ సినిమాలో అడివి శేష్‌తో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ కనిపించారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియాతో పాటు GMB ఎంటర్టైన్మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మిస్తున్నారు.