సమంత ఇన్స్టాగ్రామ్ ద్వారా అంత సంపాదిస్తోందా..?
టాలీవుడ్ స్టార్ నటీమణుల్లో ప్రస్తుతం హీరోయిన్గా రోజురోజుకు తనకంటూ మరింతగా క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకెళ్తున్న నటి సమంత. తొలిసారిగా గౌతమ్ మీనన్ తీసిన ఏ మాయ చేసావే మూవీతో టాలీవుడ్‌కి హీరోయిన్గా పరిచయం అయిన సమంత, ఆ మూవీలోని జెస్సి పాత్ర ద్వారా ప్రేక్షకాభిమానులని ఎంతో ఆకట్టుకున్నారు . ఆ విధంగా ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ కొట్టిన సమంత ఇప్పుడు వరుస సినిమాలతో ఫామ్‌లో ఉంది. అటు తెలుగు, తమిళం, హిందీలో పెద్ద పెద్ద ప్రాజెక్టులతో బిజీబిజీగా గడిపేస్తుంది.
సామ్.. సోషల్ మీడియాలో యమ యాక్టీవ్‌గా ఉంటారు. అయితే సామ్ ఊరికే టైంపాస్ కోసం సోషల్ మీడియా యూజ్ చేయట్లేదు. దానిని కూడా ఆదాయ వనరుగా మార్చుకొని డబ్బులు సంపాదిస్తోంది. ఆమె ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు.. కోట్ల రూపాయలు ఆమె అకౌంట్లో పడిపోతాయి. ఇన్‌స్టాలో సమంతకు రెండు కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే సామ్ ఏ పోస్ట్ పెట్టిన ఆ పోస్ట్ నిముషాల్లో వైరల్ అవుతుంది.పైగా సామ్ ఫ్యాన్స్ కాస్త నెక్ట్స్ లెవల్లో కనిపిస్తారు. పోస్ట్ ను షేర్ చేస్తూ ట్రెండింగ్ లోకి తీసుకొస్తారు.అందుకే సామ్ తన ఇన్ స్టా అకౌంట్ లో ఒక్క పోస్ట్ పెడితే చాలు కోట్ల రూపాయల పారితోషికాన్ని అందిస్తున్నాయట వ్యాపార సంస్థలు.ఇలా మొత్తంగా సమంత ఒక్క ఇన్‌స్టా ఖాతా నుంచే నెలకు రూ. 3 కోట్లు అందుకుంటుందట.
ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిలో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒకరు. ఒక్క బ్రాండ్‌ని ప్రమోట్ చేయాలంటే..రూ. 50 కోట్లు తీసుకుంటాడట విరాట్. ఇంకా.. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఒక్క పోస్ట్‌కు రూ.3 కోట్లు, షారుఖ్, ఆలియా భట్, కత్రినా రూ.కోటి చొప్పున తీసుకుంటారట. మొత్తానికి ఇన్ స్టా ద్వారా సంపాదన అనేది సినిమాను మించిన ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. దీంతో నటీనటులు సైతం ఈ ఆఫర్‌ను చక్కగా ఉపయోగించుకుంటున్నారు.