పెళ్లి పై ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లకు ఓ రేంజ్ లో రిప్లై ఇచ్చిన యాక్టర్ నవదీప్!
Navdeep: టాలీవుడ్ ప్రేక్షకులకు సినీ నటుడు నవదీప్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. జై సినిమా ద్వారా సినీరంగంలో అడుగుపెట్టిన ఈ యువ హీరో ఆ పై పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులకు అలా గుర్తుండి పోయాడు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకుల విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
ఇక కెరీర్ పరంగా ఓ రేంజ్ లో దూసుకుపోతున్న నవదీప్ పెళ్లి విషయంలో మాత్రం చాలా వరకు వెనుక పడిపోయాడానే చెప్పవచ్చు. నవదీప్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన పోస్టులను అప్ డేట్ చేస్తూ ఉంటాడు. పోస్టులు చూసిన నెటి జన్లు కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తే.. మరికొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటారు.
ఈ క్రమంలో కొందరు నెటిజన్లు నవదీప్ ను పెళ్లి చేసుకోమని సలహాలు ఇస్తూ.. ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా నెటిజన్లు చేసే ట్రోల్స్ పై స్పందిస్తూ నవదీప్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో ద్వారా తెలియజేశాడు. ఇంతకీ నవదీప్ ఆ వీడియో ద్వారా ఎం తెలియజేశాడు అంటే. ‘వద్దురా సోదరా’ అనే హెడ్ లైన్ పెట్టి వీడియో ద్వారా పంచుకున్నాడు.
Oddhu ra sodhara 🙂 pic.twitter.com/IYKSAGFDVE
— Navdeep (@pnavdeep26) January 23, 2022
‘అన్న గడ్డం తెల్లబడింది. త్వరగా పెళ్లి చేసుకోండి అని సలహాలిస్తున్నారు కొందరు. గడ్డం తెల్లబడితే చేసుకోవాల్సిన ట్రిమ్మింగ్ కానీ పెళ్ళి కాదు. దురద పెడితే గోక్కుంటాము కానీ తోలు పీక్కోము కదా అలాగే ‘ అని నెటిజన్లకు నవదీప్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.