ఆ హీరోయిన్‌తో ఆది పినిశెట్టి ప్రేమ వివాహం?
గుండెల్లో గోదారి సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన నటుడు ఆది పినిశెట్టి.. ‘సరైనోడు’, ‘నిన్ను కోరి’, ‘రంగస్థలం’ ‘నీవెవరో’, ‘యూ టర్న్’, ‘గుడ్ లక్ సఖి’ వంటి చిత్రాలతో అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అనతి కాలంలోనే తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆది గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
ఆది త్వరలోనేపెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. కన్నడ బ్యూటీ నిక్కీ గల్రానీని మనువాడనున్నట్లు సమాచారం. 2015లో విడుదలైన ‘యాగవరైనమ్ నా కక్కా’ సినిమాలో తొలిసారి ఆది-నిక్కీ స్క్రీన్ కలిసి నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య మంచి స్నేహం చిగురించింది. ఆ తర్వాత ‘మరగాధ నాణ్యం’ చిత్రీకరణ సమయంలో వీరు ప్రేమలో పడ్డారని.. డేటింగ్‌లో ఉన్నారని.. గతంలో వార్తలు వచ్చాయి. ఇక వాళ్ల ప్రేమ ప్రయాణాన్నిపెళ్లితో ముగింపు పలకనున్నారని తమిళ ఇండస్ట్రీలో జోరుగా టాక్ నడుస్తుంది. వీరిద్దరి పెళ్లి వారి తల్లిదండ్రులు కూడా అంగీకరించారట. ఇక నిశ్చతార్ధం ఏర్పాట్లు కూడా రహస్యంగా జరిగిపోతున్నాయని కూడా చెప్పుకుంటున్నారు. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో ఆయన తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆయన కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆది పినిశెట్టి కూడా తన వైవిద్యమైన నటనతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోపక్క విలన్‌గానూ నటించి మెప్పించారు.