మాజీ మంత్రి దాడి వీరభద్రారావు ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం.
ఉత్తరాంధ్రలో బలమైన నేత మాజీమంత్రి దాడి వీరభద్రారావు. అన్ని అంశాల పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మొదటి నుండి టీడీపీలో ఉన్న ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగానూ చేశారు. అయితే వైసీపీ ఆవిర్భావం అనంతరం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఆయన అదృష్టం బాగోలేక 2014 ఎన్నికల్లో వైసీపీ గెలవలేదు. తదనంతరం మళ్లీ వైసీపీకి రాజీనామా చేసి జగన్ పై తీవ్ర విమర్శుల చేసి బటయకు వచ్చారు.
టీడీపీలోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా చెల్లుబాటు కాలేదు. దీంతో చేసేదేంలేక మళ్లీ ఎన్నికల ముందు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే తాను అనుకున్నంత స్థాయిలో ఆయన్ను వైసీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదు. మూడేళ్లు అధికార పార్టీలో ఉన్నా ఎప్పుడూ ఆయన హడావుడి కనిపించడంలేదు. దీంతో ఆయన అనుచరులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్టీలో గుర్తింపులేక, పనులు కాక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆయన అనుచర వర్గం ఓ నిర్ణయానికి వచ్చారు.
మళ్లీ సొంతగూటికి వెళ్లాలని అనురులు ఓ అనుకుంటున్నారని తెలుస్తోంది. అంతేకాదు స్వయంగా దాడి వీరభద్రరావే చంద్రబాబును కలిసి పార్టీలో చేరబోతున్నట్లు తెలపాలని ఒత్తడి తెచ్చారంట. అంతేకాదు అనకాపల్లిలో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన విజయవంతం కూడా దాడిని, ఆయన అనుచర వర్గాన్ని టీడీపీలో చేరాలన్న ఆలోచనలో పడేసింది. అయితే దీనిపై ఆయన బహిరంగంగా నోరు విప్పలేదు. టీడీపీలో చేరతారో..వైసీపీలోనే కొనసాగుతారా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.