ఎస్సై చొక్కా పట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన చలో రాజ్‌భవన్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది. రాహుల్‌గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ గురువారం ఆందోళనకు దిగారు. ఖైరతాబాద్ చౌరస్తాలో యువజన కాంగ్రెస్ నేతలు బైక్‌కు నిప్పు పెట్టారు. బస్సుల రాకపోకలను అడ్డుకుని నిరసన తెలపారు. ఆర్టీసీ బస్సు ఎక్కి యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది.
పోలీసులతో కేంద్రమాజీమంత్రి రేణుకాచౌదరి తీవ్ర వాగ్వాదానికి దిగింది. తనను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఆమెను అరెస్టు చేయబోగా ఎస్సై కాలర్ పట్టుకుని రేణుకా ప్రశ్నించారు. దీంతో రేణుకను మహిళా పోలీసులు చుట్టుముట్టారు. మహిళా పోలీసులతోనూ రేణుక వాగ్వాదానికి దిగారు. అనంతరం రేణుక చౌదరిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే పోలీస్ వాహనంలోకి ఎక్కేందుకు నిరాకరించగా బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. పోలీస్ జులూం అనిసించాలి అంటూ రేణుకాచౌదరి నినాదాలు చేశారు.
అయితే నిరసనలో విధ్వంసం చేసింది తమ కార్యకర్తలు కాదని, ఒకవేళ తమ కార్యకర్తలు చేస్తే క్షమాపణలు చెబుతామని వివరణ చ్చారు. కొందరు టీఆర్ఎస్ వాళ్లే చేశారని ఆరోపించారు. అంతకముందు ఖైరతాబాద్ కూడలి వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, గీతారెడ్డి, మహేశ్‌కుమార్ పాల్గొన్నారు. రాజ్‌భవన్ ముట్టడికి దూసుకెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసులను రేణుకా చౌదరి చొక్కా పట్టుకోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.