అధిక ఒత్తిడికి గురవుతున్నారా… అయితే తస్మాత్ జాగ్రత్త…
ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్లు సైతం వివిధ రకాలైన ఒత్తిడికి గురవుతున్నారు. అవి ఆర్థిక పరమైన ఒత్తిడి బిజినెస్ ,ఉద్యోగాల ఒత్తిడి, ఆరోగ్యం ప్రేమ, చదువుతూ వంటి ఒత్తిడి అధికం అధికం అవుతున్నాయి. మారుతున్న పరిస్థితులను బట్టి వాటిని అధిగమిస్తూ చేసుకుంటూ జీవనశైలిని ముందుకు సాగించాలి. అయితే ఒత్తిడిని అధిగమించడానికి మన మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది కొన్ని అధ్యయనాల్లో తేలింది అవి ఏంటో తెలుసుకుందాం…
ఒంటరిగా ఉండటం అధికంగా ఫోన్లో ఉపయోగించడం ద్వారా మెదడు పై ప్రభావము అధికంగా ఉంటుంది. ఒత్తిడి సమస్య మరింత రెట్టింపు అవడంతో అనారోగ్య సమస్యలు వంటివి ఏర్పడతాయి. అలానే టీ కాఫీ వంటి పానీయాలు తక్కువ సేవించడం మంచిదని తెలుపుతున్నారు. మెదడుపై ఆలోచన విధానాన్ని తగ్గించుకోవడం ద్వారా ఎటువంటి ఒత్తిడి సమస్యలు ఏర్పడవు. ఒత్తిడి వంటి సమస్యలను ఈ క్రింది మన జీవన శైలిలో అవలంబించడం ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది అవేంటో తెలుసుకోండి మరి
పురాతన కాలం నుండి ఆచరిస్తున్న వాటిలో యోగ అత్యంత ముఖ్యమైనది. ఉదయాన్నే లేచి యోగ ఆసనాలు చేయడం వల్ల మన మెదడు పై ఉండే ఒత్తిడి ఒత్తిడి సమస్యను అధిగమించవచ్చు. ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో వాకింగ్ చేయడం కూడా మంచిది అని చెబుతున్నారు మరియు సంగీతాన్ని కూడా వినడం ద్వారా మెదడు రెట్టింపు ఉత్సాహంగా పనిచేస్తుంది అని తెలుపుతున్నారు. స్నేహితులతో కుటుంబ సన్నిహితులతో రోజులో ఒక గంట సమయాన్ని కేటాయించడం వల్లన ఒత్తిడి సమస్యను మర్చిపోయి సంతోషంగా ఉంటారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇవి కేవలం నిపుణులు సూచించిన సలహాలు మాత్రమే ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వైద్యులను సంప్రదిస్తే మంచిది.