పాలు తక్కువగా ఉన్న బాలింతలు ఇవి తింటే పాలు పడతాయి..!

బాలింతలుగా ఉన్నవారు పిల్లలకు సరిపడా పాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజుల్లో. బాలింత సమయంలో ఎలా మెలగాలో సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తోంది. తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమో అందరికీ తెలిసింది. అయితే పాలు పడటానికి కొన్ని చర్యలు తీసుకుంటే సరిపోతుంది అవేంటంటే.. పాలు బాగా ప‌డాలంటే బాలింత‌లు పాత బెల్లం, పాత అల్లం పచ్చడి తినాల్సి ఉంటుంది. అలాగని అధికంగా తినకూడదు. నువ్వుల నూనెతో చేసిన వంటలు పాలు పెంచే పనులు చేస్తాయి. మున‌గ ఆకుల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అవి బాలింత‌ల్లో బాలింతలకు పాలు బాగా ప‌డేలా చేస్తాయి.

ఓట్స్ తింటే తల్లిపాలు పెరగడంతో పాటు శుభ్రమైనవి ఏర్పడతాయి. ఇందులో తేనె, ఏమైనా నట్స్, మీకు నచ్చిన ఫ్రూట్స్ కలిపి కూడా తినొచ్చు. ఓట్స్ బిస్కెట్స్ కూడా తినచ్చు. దీని వల్ల పాలు పెరిగే అవకాశం ఉంది. మెంతులూ, మెంతి కూర బాలింతలకి మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ తల్లికీ బిడ్డకీ మంచి చేస్తాయి. గుడ్లలో ఉండే ప్రొటీన్, విటమిన్ బీ12, విటమిన్ డీ, రైబోఫ్లావిన్, ఫోలేట్, కోలీన్ చిన్న పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ క్ సహాయ పడతాయి.

బాలింతలు రోజుకి రెండు గుడ్లు తీసుకోవచ్చు. వీటిని ఉడకబెట్టుకుని అయినా, ఆమ్లెట్ తోనైనా తినొచ్చు.  పాలకూరతో పాటూ మిగిలిన ఆకుకూరలు కూడా బాలింతలకి మంచి చేస్తాయి. వండిన పాలకూరనే తినాలి.  ఇది తిన బిడ్డకి పాలివ్వడం వల్ల తల్లికీ బిడ్డకీ మధ్య ఒక చక్కని మానసిక బంధం ఏర్పడుతుంది. బ్రౌన్ రైస్ లో ఫైబర్, న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వండడానికి ముందు కొన్ని గంటలపాటూ బ్రౌన్ రైస్ ని నీటిలో నాన బెట్టడం వల్ల రైస్ ఈజీగా ఉడుకుతుంది. ఇవే కాకుండా పాలు పెరగడానికి పనికి వచ్చే ఆహార పదార్ధాలు ఇంకా ఉన్నాయి.

గమనిక : వైద్యుల సలహాలు, సూచనలు తప్పనిసరి….

 

 

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *