కలబందతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.?

కలబంద ఒక చిన్న కాండం కలిగిన పొద. దీనిని తరచుగా వండర్ ప్లాంట్ అని పిలుస్తారు. దీనిలో 500 జాతులు ఉండగా, వీటిలో ఎక్కువ రకాలు ఉత్తర ఆఫ్రికాలో పెరుగుతాయి. కలబంద ప్రయోజనాలు చాలా మందికి తెలియవు. భారతీయ, చైనీస్ వైద్యాలతో పాటు పాశ్చాత్య వైద్యంలో కూడా ఇది బాగా ప్రాచుర్యం పొందింది. సహజ సిద్ధంగా లభిస్తుంది కూడా. దీన్ని ఆయుర్వేధ, మిగతా మెడిసిన్లో కూడా అధికంగా వాడతారు.  కలబంద వినియోగం వల్ల శరీరంలోని పోషకాల కొరతను తీరుతుంది. రసాన్ని సేవిస్తే రక్తంలోని హెమోగ్లోబిన్ లోపం నివారించవచ్చు.

అంతే కాకుండా పొడి చర్మం, ముడతలు, ముఖంపై మచ్చలు తొలగించడంలో కలబంద సహాయం చేస్తుంది.  కలబందలో 75 విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.మొహంపై మొటిమలు, మచ్చలు ఉన్నవాళ్లు కలబంద గుజ్జును పూసుకుంటే పోతాయి. కలబందలో చర్మాన్ని మృదువుగా చేసే లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ప్రత్యేకించి మొటిమల కోసం వాడే చాలా మాయిశ్చరైజర్లలో కలుపుతారు. చర్మంపై మంట, దురద, కాలిన గాయాలకు కలబంద మెడిసిన్ గా పనిచేస్తుంది.

పాయిజన్ ఐవీ వల్ల కలిగే దురద మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో వచ్చే అంటువ్యాధుల, మలబద్ధకానికి కలబంద పనిచేస్తుంది. కలబంద తింటే మంచి భేదిమందుగా పనిచేస్తుంది. పాలు, జొన్నలో దీన్ని వినియోగంచి తినవచ్చు. కానీ వైద్యుడి సలహాలు తప్పనిసరి. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా పనిచేస్తుంది. జుట్టు మెరుపునకు, జుట్టు రాలకుండా చేస్తుంది. అయితే కలబంద వాడకాన్ని 12 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవాళ్లు వాడకూడదు. అది పొట్టలో అసౌకైర్యం కలిగించి అతిసారాకు దారి తీస్తుంది.

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *