టీడీపీ ఏడుపు పార్టీగా తయారైంది : ఎంపీ మార్గాని భరత్

పేదవాడికి మంచి జరుగుతుంటే టీడీపీ ఏడుపేంటని, ఏడుపు పార్టీగా తెలుగుదేశం తయారైందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి ట్రెండ్ సెట్టర్ గా ఉంటారని అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై పోరాటం చేస్తూ, వాటిని సాధించుకుంటూ ముందుకు వెళుతుంటే.. టీడీపీ మాత్రం ఢిల్లీ వచ్చి ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రిగారిపైన నిందలు మోపుతుందని, రాష్ట్రంలో పేదవాడికి మంచి జరుగుతుంటే.. చూసి ఓర్వలేక, టీడీపీ ఒక ఏడుపు పార్టీగా తయారైందన్నారు.

తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాటలు, వారి పద్ధతి చూస్తుంటే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా.. రాష్ట్రాన్ని దెబ్బతీసే విధంగా వారి మాటలు – చేష్టలు ఉన్నాయన్నారు.  జగనన్న నవరత్నాలు అమలు చేస్తుంటే.. టీడీపీకి నవ రోగాలు, నవ రోదనలు వారి విధానంలో ఉందన్నారు. రోజూ వారిది ఏడుపు పార్టీనే. మంచి జరుగుతుంటే.. ప్రతి దానికీ ఏడుపేనని, అందుకే, కేంద్రం జోక్యం చేసుకోవాలని, రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని.. ఇలా రోజూ టీడీపీ నేతల రోధనలు, ఆక్రందనలు చేస్తోందన్నారు.

టీడీపీ నాయకులు పొద్దున లేస్తే.. ఏదొక ఏడుపుతో, ఆర్తనాదాలతో వారి రాజకీయాన్ని ప్రారంభిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్రానికి సంబంధించి, దక్షిణ కోస్తా రైల్వే జోన్ పై కేంద్ర కేబినెట్ లోనూ చర్చించారని, తమ పార్టమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, లోక్ సభలో ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గార్ల నేతృత్వంలో తమా పార్టీ ఎంపీలంతా చేసిన పోరాటం ఫలితంగా, ముఖ్యమంత్రి జోక్యంతో, ఇవ్వటం కుదరని, సాధ్యం కాదని చెప్పిన పరిస్థితుల నుంచి ఈరోజు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇచ్చే విషయంలో ఒక అడుగు ముందుకు పడిందన్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కాదా..? అని ప్రశ్నించారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *