రాజీనామాపై హైకోర్టుకు వెళ్లనున్న గంటా..!

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామా ఆమోదం కోసం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది వరకే తన రాజీనామాను స్పీకర్ కు గంటా అందించారు. అది ఏడాది నుండి ఆమోదం పొందలేదు. దీంతో కోర్టుకు వెళ్లాలని గంటా డిసైడ్ అయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గంటా గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో అప్పటి నుండి అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ మూడేళ్లలో చంద్రబాబు, లోకేష్ ను ఒక్కసారి కూడా కలవలేదు. కానీ అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటున్నారు. అయితే గతేడాది విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం మొదలైంది.

తన చురుకైన పాత్రను మళ్లీ తెరమీదకు తెచ్చేందుకు స్టీల్‌ ప్లాంటు కార్మిక సంఘాల పోరాటానికి నైతిక మద్దతు తెలుపుతూ గతేడాది ఫిబ్రవరి 6న ఆయన తన ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు.  అయితే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేదనే విమర్శలు వచ్చాయి. దీంతో ఫిబ్రవరి 12న స్పీకర్ ఫార్మాట్ లో మరోసారి రాజీనామా   సమర్పించారు.  అసెంబ్లీ స్పీకర్ ను  నేరుగా కలిసి రాజీనామాను ఆమోదించాలని కోరారు.  ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ఆయన రాజీనామాకు ఆమోదం లభించలేదు.

ఇటీవల జరిగిన  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు మరోసారి లేఖ రాశారు. అయినా ఆమోదించకపోవడంతో ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామా ఆమోదం పొందేలా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని గంటా శ్రీనివాస రావు నిర్ణయించారు. ఇటీవల విశాఖ జిల్లాలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలోనూ వంగవీటి రాధాతో కలిసి పాల్గొన్నారు. కాపులు కీలక శక్తిగా ఎదగాలని కూడా వ్యాఖ్యానించారు గంటా శ్రీనివాస రావు. దీంతో గంటా రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది తెలియడం లేదు.

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *