గోల్డ్ లోన్ తీసుకునే వాళ్లకు శుభవార్త… ఇకపై 90 శాతం విలువ రుణంగా పొందే అవకాశం…?
March 1, 2021
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆర్బీఐ ప్రజలకు తీపి కబురు అందించింది. ఇప్పటికే మారటోరియం గడువు పెంచుతూ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చేసిన ఆర్బీఐ తాజాగా బంగారు ఆభరణాలపై రుణం విలువను పెంచింది. ఇప్పటివరకు బంగారంపై 75 శాతం మాత్రమే రుణంగా లభించగా ఇకపై 90 శాతం వరకు రుణంగా లభిస్తుంది.
విశ్లేషకులు కరోనా కష్టకాలంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. బంగారం యొక్క నాణ్యతను పరిశీలించి అధికారులు రుణాన్ని మంజూరు చేస్తారు 18 క్యారెట్ల నుంచి 24 క్యారెట్ల బంగారానికి ఎక్కువ మొత్తం రుణంగా లభిస్తుంది. 2021 మార్చి వరకు మాత్రమే బంగారంపై 90 శాతం రుణం మంజూరవుతుంది. ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయం పట్ల ప్రజలు హర్షంవ్యక్తం చేస్తున్నారు.