ద్వారంపూడి రాజకీయ చరిత్ర ముగిసిందన్న కాపుసంఘం
వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ చరిత్రకు 2024లో ముగింపు పడుతోందని కాపుసంఘం ప్రకటించింది. ఈమేరకు మంగళవారం ఆ సంఘం అధ్యక్షుడు గంగా సురేష్ బండారు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలోని సారాంశం.. ‘‘జిల్లాలో ఎక్కడ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారిని ఒడిస్తా అని ప్రగల్భాలు పలుకుతున్న ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి.. నువ్వు ఉన్న చోట గెలవవని సర్వేలలో తేలడంతో, మీ పార్టీ సీటు ఎక్కడ ఇవ్వదో అని భయంతో పవన్ కళ్యాణ్ పై ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నావు.
జిల్లాలో ఎక్కడో ఒక చోట సీటు సంపాదించాలని నీ నీచపు ఆలోచనకు ఇదే మా హెచ్చరిక.. నువ్వు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడ పోటీ చేసినా నీకు డిపాజిట్ కూడా రాకుండా అన్ని సామాజికవర్గాలు కలిసి బడుగు బలహీన వర్గాల పార్టీ అయిన జనసేనతో ఏకమై నిన్ను చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధం ఉన్నాయి. నిన్ను ఓడించడానికి పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు. జనసేన పార్టీలోని సామాన్య కార్యకర్త మీద కూడా నువ్వు నెగ్గలేవు. పందికొక్కులా పేదల బియ్యాన్ని, ప్రజాధన్నాని మేస్తూ కాకినాడ ప్రతిష్టను దిగజార్చావు.
ఏ మొహం పెట్టుని నువ్వు పవన్ కళ్యాణ్ గారిపై పోటీ చేస్తా అని చెప్పుకుంటున్నావు.? అక్రమ భాగోతాలతో సంపాదించిన ధన బలం చూసుకొని రెచ్చిపోతున్న నీకు కాపు సామాజికవర్గం జనసేనతో కలిసి వచ్చి ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పుతుంది. అసభ్య ప్రవర్తన పదజాలంతో మహిళల పై దూషణలు చేసే నీ సంస్కృతికి, నిన్ను చొక్కా పట్టుకొని రోడ్డు పైకి ఈడ్చే రోజు దగ్గరలోనే ఉంది. బలం చూసుకొని విర్రవీగుతూ జనసేన చేతిలో నీ ఓటమిని నువ్వే కొనితెచ్చుకొన్నావ్. ద్వారంపూడి.. నీ రాజకీయ చరిత్రకు జనంలో నుండి పుట్టిన జనసేన 2024 ముగింపు పలుకుతుంది’’ అని ప్రకటనలో పొందుపరిచారు.