వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై అట్రాసిటీ కేసు

ఒంగోలు పట్టణానికి చెందిన వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనను దూషించారని పోలీసులకు మేయర్ గంగాడ సుజాత సుబ్బారావుగుప్తాపై  ఫిర్యాదు చేశారు. దీంతో అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో కార్పోరేషన్ సిబ్బంది తొలగించిన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం విషయంలో మేయర్‌ గంగాడ సుజాతను కలిసినట్లు సుబ్బారావు గుప్తా చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల్లో వైసీపీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు.

కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ల ప్రవర్తనతో జనం వైసీపీకి దూరమవుతున్నారని చెప్పారు. తదనంతంర సుబ్బారావుపై వైసీపీ నేతే దాడి చేశారు. మరోసారి వైసీపీపై విమర్శలు చేస్తే చంపేస్తామని కూడా బెదిరించారు. ఆ వీడియో అప్పుడు సోషల్‌ మీడియాలో సైతం వైరల్ అయింది. కానీ తర్వాత బాలినేనితో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. వివాదం అంతటితో అయిపోయిందని భావించాక డిల్లీ వెల్లి తనకు గన్‌మెన్‌లను కేటాయించాలన్నారు.

ఢిల్లీలో రఘురామకృష్ణను కలిసి సైతం చర్చించారు. అనంతరం విజయవాడకు వచ్చి వంగవీటి రాధాను కూడా కలిసి పరామర్శించారు. అనంతరం జగన్ ను పొడుగుతూ పార్టీని తిట్టడం మొదలుపెట్టాడు సుబ్బారావు గుప్తాం. ఆర్యవైశ్యుల ఐక్యవేదిక సదస్సులో సైతం తనపై కొందరు దాడి చేసిన జగన్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యులకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోతోందని, దానికోసం అందరూ ఐకమత్యంతో ఉండాలని కోరారు. అంతే కాకుండా సుబ్బారావు గుప్తా చేష్టలు పార్టీకి తలనొప్పిగా మారారు. దీంతో ఆయన్ను టార్గెట్ చేసి నోరు మూయించే ప్రయత్నాలు జరుగుతన్నాయని సమాచారం వస్తోంది. అయితే ఆయనకు అండగా నిలబడేందుకు ఆర్యవైశ్యులు సిద్ధమవుతున్నారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *