చిన్న వయసులోనే మేయర్ కుర్చీపై దళిత యువత..ఎక్కడంటే.?
29 ఏళ్లకు ఓ యువతి మేరయ్ కుర్చీపై కూర్చుంది. అదికూడా సాధారనణ నగరం కాదు..మెట్రో నగరం. అది కూడా దళిత వర్గానికి చెందిన యువతి. మొదటి సారి ఆ వర్గం నుండి మేయర్ కుర్చీలో కూర్చునే సదావకాశం యవతికి దక్కింది. దీంతో ఆ వర్గాల్లో ఆనందోత్సవాలు వెల్లువెత్తాయి..ఇంతకీ ఎవరా యువతి..ఎక్కడా నగరం.. వివరల్లోకి వెళ్తే తమిళ రాజకీయాలలో డీఎంకే(ద్రవిడ మున్నెట్ర కజకం)నూతన ఒరవడి సృష్టించింది. గతంలో డీఎంకే అధికారంలోకి వస్తే మేయర్ గా దళితులకు అవకాశం ఇస్తామని ఎన్నికల హామీలో స్టాలిన్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు స్టాలిన్.
డీఎంకేకు చెందిన 29 ఏళ్ల ప్రియ చెన్నై మేయర్ పీఠంపై కూర్చింది. చెన్నై కార్పొరేషన్లో 74వ వార్డు నుండి ప్రియ భారీ మెజార్టీతో విజయం సాధించారు. గెలిచారు సాధించారు. ఇప్పుడు ప్రియా పేరు తమిళనాడులో మార్మోగుతోంది. 29 ఏళ్ల చిన్న వయస్సులోనే చెన్నై మేయర్‌గా ఎంపిక కావడమే కాకుండా, తొలి దళిత మహిళగా మేయర్ పీఠంపై కూర్చున్న ఖ్యాతిని పొందారు. ప్రభుత్వం చెన్నై మేయర్ స్థానాన్ని ఎస్సీ మహిళకు రిజర్వు చేసింది. కౌన్సిలర్‌గా గెలిచిన ఆమె మేయర్ పీఠంపై కూర్చుంటుందని మాత్రం అసలు ఊహించలేదు.
చెన్నైకి మేయర్‌గా చేసిన వారిలో మహిళల్లో ప్రియా మూడో వ్యక్తిగా నిలిచారు. దళిత వర్గానికి చెందిన మహిళ చెన్నై మేయర్‌గా ఎన్నికవడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. చిన్న వయస్సులోనే పెద్ద బాధ్యతలు చేపట్టడంపై అటు దళితులతోపాటు ఇటు మహిళలు ప్రియను కొనియాడుతున్నారు. తనపై ఉంచిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వహిస్తానని ప్రియా చెప్తోంది. నగర అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొంది.