ఈ సమస్యలు ఉన్నవారు అరటిపండు తినడం తగ్గిస్తే బెటర్ ?
పండ్లలో రారాజు అంటే అరటి పండు అనే చెబుతారు. అరటిలో విటమిన్ బి6, పొటాషియం, విటమిన్ సి, మాంగనీస్, మెగ్నీషియం, బయోటిన్, రాగి పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో కొవ్వు శాతం 0 ఉంటుంది. ఇక ఈ పండును తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అజీర్తి సమస్య, అధిక రక్తపోటు, ఆస్థమా, మధుమేహం, జీర్ణ సమస్యలు, క్యాన్సర్ వంటి అనేక సమస్యలను నిరోధించడంలో అరటి ముందుంటుంది. అందుకే వైద్యులు కూడా ఈ పండ్లను రోజూ తినాలని సలహానిస్తుంటారు. అయితే అరటి తినడం వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో మీకోసం…
మలబద్ధకం : అరటిపండ్లు మోతాదుకు మించి తింటే మలబద్ధకం సమస్య వస్తుంది. ఎందుకంటే దీనిలో ఉండే టానైట్ యాసిడ్ డైజెస్టివ్ సిస్టం పై తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. అందుకే మలబద్ధకం సమస్యతో బాధపడేవారు అరటి పండ్లను తక్కువగా తినడం ఉత్తమం.
ఎసిడిటీ : అరటిపండులో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తిన్నది తొందరగా జీర్ణం కాదు. అందులోనూ ఈ పండు తింటే కడుపులో గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది. సో ఈ పండును మోతాదులో తినడం మంచిది.
అధిక బరువు : అరటికాయలో చక్కెర, ఫైబర్ లు పుష్కలంగా లభిస్తాయి. కాగా ఈ పండును తింటే ఆటోమెటిక్ గా బరువు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకని బరువు తగ్గాలనుకునే వారు ఈ పండ్లకు దూరంగా ఉండటం ఉత్తమం.
మైగ్రేన్ : మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు ఈ అరటి పండుకు దూరంగా ఉండటం మంచిది. అరటిపండులో టైరమైన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మైగ్రేన్ సమస్యను ఇంకా తీవ్రతరం చేయడంలో సహాయపడుతుంది. అందుకే ఈ సమస్య ఉన్న వారు అరటిపండుని తక్కువగా తినడం జోలికి పోకూడదు.
డయాబెటీస్ : ఈ సమస్యతో బాధపడేవారు అరటిపండును అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ పండులో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. అందుకే ఈ వ్యాధి గ్రస్తులు అరటిని తక్కువ మోతాదులో తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
అలర్జీ : అలర్జీ సమస్యతో బాధపడేవారు అరటి పండ్లను తినకపోవడం ఉత్తమమైన పని. ఎందుకంటే ఈ పండును వారు తినడం మూలంగా అలర్జీ సమస్య మరింత పెరుగుతుంది.