ప్రతి రోజు ఏడు రూపాయలు ఆదా చేస్తే అక్షరాల 60,000రూపాయల పెన్షన్ మీ సొంతం!
Atal Pension Yojana: ఈ మధ్య కాలంలో చాలా మంది తాము సంపాదించిన డబ్బును ఎలాగైన సేవ్ చేసి పొదుపు చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. దీనికోసం వారు రకరకాల పాలసీలు మంచి స్కీమ్ లలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఏదో ఒక రూపం లో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుందని ధైర్యంతో ఉంటున్నారు.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల కోసం మంచి పథకాలు అమలు చేస్తుంది. ఆ ఇందులో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ఒకటి. 2015 మే లో మోడీ ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు లోకి తెచ్చింది. కేంద్రం అమలు చేసిన ఈ స్కీమ్ ఉద్యోగులకు ఊహించని స్థాయిలో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. దేశంలో కొన్ని కోట్ల మంది ఈ స్కీమ్ ను ఉపయోగించుకుంటున్నారు.
ఇక మెరుగైన లాభం పొందాలనుకునే వారికి ఈ స్కీమ్ బాగానే ఉపయోగపడుతుంది. తక్కువ సమయంలోనే రిటైర్మెంట్ అయ్యే వాళ్లకు ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుందట. అసలు ఈ స్కీమ్ వివరాలకు వస్తే రోజుకు ఏడు రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేయాలి.
ఇలా చేస్తే నెలకు 5000 రూపాయలు చొప్పున ఏడాదికి 60 వేల పెన్షన్ పొందే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ స్కీమ్ కు సంబంధించిన లింకు ద్వారా చేరి ఒక చిన్న ఓటిపి ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన సమాచారాన్ని పూర్తి చెయ్యాలి. అంతే కాకుండా మొబైల్ నెంబర్ నుంచి ఆధార్ కార్డు వివరాలు కూడా ఆ లింక్ లో జత చెయ్యాలి.