వామ్మో.. దట్టమైన అడవితో కూడిన పెద్దని గుహ!
Dong Cave: చిన్నప్పటి నుంచి మనం ఎన్నో రకాల గుహలు గురించి వింటూ.. చూస్తూ వచ్చాం. వాటిలో కొన్ని జంతువులకు సంబంధించిన గుహలు ఉంటాయి. మరి కొన్ని రాజుల కాలం నాటి గుహలు ఉంటాయి. ఇక రాజుల కాలం నాటి గుహలు చూస్తే అవి భయంకరంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. అలా సన్ డూంగ్ అనే గుహ
కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆశ్చర్య పరుచుతుంది.
ఆ గుహ చూసేందుకు రెండు కళ్లు చాలవు అనే చెప్పవచ్చు. అక్కడికి వెళ్లడం ఒక సాహసం లాంటిది. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడం ప్రాణాలకే ముప్పు. ఆ గుహ గురించి మాటల్లో చెప్పలేము. సాధారణ గుహలకు, ఈ గుహలకు అసలు పోలికే ఉండదు. దీని లోపల నదులు ఉన్నాయి, పెద్ద ఎత్తున కొండలు ఉన్నాయి. ఎన్నో జీవరాసులు, జలచరాలు, దట్టమైన అడవి కూడా ఉంది.
చెప్పాలంటే భూమ్మీద ఉన్న వైవిద్య అంతా అక్కడే ఉంది. అది తెలిసిన శాస్త్రవేత్తలు దానిలోపలకు వెళ్లి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గుహ లోకి వెళ్ళిన వారు కొందరు గ్రహాంతర గుహ గా భ్రమ పడుతున్నారు. ఈ గుహని మొత్తం చూడాలనుకునేవారు ఒకరోజులోనే తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు.
కొందరు ఎక్కువ పట్టుదల కలిగినవారు కావలసినంత ఆహారం ఏర్పాటు చేసుకొని మరీ.. ప్రయాణం సాగిస్తున్నారు. కానీ వారు ఓటమిని చవి చూడక తప్పడంలేదు. మరి కొందరు ఇలా అయితే కష్టం అని భావించి ఏకంగా డ్రోన్ కెమెరాలను లోపలకి పంపుతున్నారు. అయినప్పటికీ వారి శోధన గుహ మొత్తంలో సోదించుడంలో ఫలించలేదు. ఈ సన్ డూంగ్ గుహ భూమి లోపల పొరల్లో ఏర్పడి ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షస్తుంది.