స్కూల్ కి వెళ్లి పాఠాలు నేర్చుకుంటున్న రోబో.. ఎందుకో తెలుసా?
Robot : మారుతున్న జీవన కాలం ఆధారంగా లోకంలో ఎన్నో వింత వింత రోబోలను సృష్టిస్తున్నారు. ఆ రోబోలు రకరకాల స్పెషల్ ఫీచర్స్ తో చూసేవారిని ఆకట్టుకుంటూ ఉంటాయి. అదే తరుణంలో బేర్లిన్ లో ఓ రోబో స్కూల్ కి వెళుతూ మంచి హడావిడి చేస్తుందట. అసలు కథ ఏమిటో తెలుసుకుందాం. ఆ రోబో పేరు అవతార్. ఆ రోబో రోజూ స్కూల్ కి వెళుతుంది. టీచర్ చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటుంది.
నిజానికి ఆ రోబో ఒక స్టూడెంట్ కి బదులు డైలీ స్కూల్ కి వెళ్లి వస్తుంది. స్కూల్ లో జరిగే క్లాసులు అన్నీ రికార్డ్ చేసుకుంటుంది. ఇంట్లో ఉన్న విద్యార్థి రోబో సహాయంతో క్లాసులను లాప్ టాప్ లో వింటున్నాడు. టీచర్లు చెప్పే పాఠాలకు రోబో స్పందిస్తుంది. ఆ విద్యార్థి కి ఏదైనా సందేహం వస్తే రోబో ద్వారా అడిగేస్తున్నాడు. అలా ఇంటిలో ఉండి పాఠాలు అన్ని నేర్చుకుంటున్నాడు.
ఈ రోబోని చూసిన మిగతా విద్యార్థులు స్టన్ అవుతున్నారు. దాన్ని చూసి ఆనందంగా ఫోటోలు కూడా దిగుతున్నారు. పిల్లలను రోబో బాగా ఎట్రాక్ట్ చేసింది. వాళ్లకి నిజంగానే స్టూడెంట్ తో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాకుండా కొన్ని ఆసక్తికరమైన అంశాలు పై చిట్ చాట్ చేస్తుంది. ఈ క్రమంలో కొన్ని జోక్స్ కూడా వేస్తుంది.
German student Joshua Martinangeli, 7, is too ill to attend classes but he can still interact with his teacher and classmates through an avatar robot that sits in class in his place https://t.co/q6DDpXXlZX pic.twitter.com/bzZVyYrPks
— Reuters (@Reuters) January 15, 2022
‘ఈ రోబో వల్ల జోషువా బాగా చదువుకో గలుగుతున్నాడు ‘ అని స్కూల్ హెడ్ మాస్టర్ మిస్ట్రెస్ ఉతె వింటర్ బెర్గ్ తెలిపారు. ‘జోషువా కి ఊపిరితిత్తుల సమస్య ఉండటం వల్ల వాటికి ఒక ట్యూబ్ అమర్చి.. దాన్ని మెడకు ఏర్పాటు చేశారు. అందువల్ల అతను స్కూల్ కి వెళ్ళ లేకపోతున్నాడు’. అని అతని తల్లి సిమోని మార్టినాన్ గెల్లి అంటున్నారు.