తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావాలా అయితే ఇలా చేయండి!
Health Tips: ప్రస్తుతం మారుతున్న జీవన విధానంలో మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నా అవి సరిగా అరగక చాలా మందిలో గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
అలాంటి సమయంలో కొంతమంది నీళ్లు తీసుకుంటారు. వట్టి నీళ్లు తీసుకుంటే సరిపోదని నిపుణులు అంటున్నారు. ఆ సమస్యలకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పెరుగు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అన్నం లో పెరుగు వేసుకుని తినవచ్చు. కొంచెం అల్లం, మిర్చి, సాల్ట్ వేసుకుని బట్టర్ మిల్క్ చేసుకొని ఎలా తీసుకున్నా సరే ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎసిడిటీ వంటి సమస్యలను నివారించడంలో ఇది బాగా సహాయపడుతుంది.
అంతేకాకుండా అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా పూర్తిగా దూరం అవుతాయి. మీరు కనుక పెరుగును డైట్ లో ప్రతిరోజూ తీసుకుంటే ఒత్తిడి, టెన్షన్ వంటి వాటికీ పూర్తిగా చెక్ పెట్టవచ్చు. కాబట్టి పెరుగును డైట్ లో ప్రతిరోజు తీసుకుంటే మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
అదే విధంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం తీసుకునే ఆహారం మాత్రమే మంచిగా ఉంటే సరిపోదు. మన జీవన విధానం కూడా సరైన విధంగా ఉండాలి. మన శరీరానికి నిద్ర చాలా ముఖ్యం. నిద్ర ఎంత బాగా ఉంటే ఆరోగ్యం అంత బాగు పడుతుంది. కాబట్టి ఎటువంటి ఒత్తిడి, టెన్షన్స్ లేకుండా హాయిగా నిద్ర పోవడం మంచిది.