రెండు రాష్ట్రాలకు ఒకటే చెక్క బెంచ్.. వైరల్ ఫోటోలు!
Viral: రెండు రాష్ట్రాలకు ఒకటే చెక్క బెంచ్ ఏంటి.. అని ఆలోచిస్తున్నారా.. అవును అది నిజమే మహారాష్ట్రలోని నందర్బర్ జిల్లాలో ఈ వింతను చూడవచ్చు. మహారాష్ట్ర, గుజరాత్ బోర్డర్ లో ఒక రైల్వే స్టేషన్ ను రెండుగా విభజించారు. అందుకని అక్కడి చెక్క బెంచ్ ను ఈ సరిహద్దుల మధ్య ఏర్పాటు చేశారు.
అందువల్ల ఆ బెంచ్ లో సగం మహారాష్ట్ర, గుజరాత్ వాళ్ళది అయింది. ఇది పశ్చిమ రైల్వేలో ఐదో ప్రత్యేక రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందింది. అందులో ఆ చెక్క బెంచీలో మహారాష్ట్ర వైపు కూర్చొని మద్యం తాగుతూ చిల్ అవ్వొచ్చు. మరోవైపు గుజరాత్ లో కూర్చుని.. పాన్, గుట్కా వంటివి అస్సలు తినకూడదట.
రైల్వే స్టేషన్ కు కొత్తగా వెళ్ళినవారు.. ఈ వింతను కనుల విందుగా చూస్తున్నారు. మరికొందరైతే మాత్రం ఆ చక్క బెంచీ తో సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటూ గుర్తుగా దాచుకుంటున్నారు. ఏదైనా చూసే వారికి చాలా వింతగా అనిపిస్తుంది. మరి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి.
మన దేశంలో రాష్ట్రాల ప్రకారంగా గుజరాత్, మహారాష్ట్ర చెప్పడానికి వేర్వేరు రాష్ట్రాల్లో అయినా ఈ రైల్వే స్టేషన్ మాత్రం రెండు రాష్ట్రాలను కలుపుతుంది. ఈ రైల్వే స్టేషన్ గుజరాత్ వైపునుంచి 800 మీటర్ల పొడవు కలిగి, 500 మీటర్ల వెడల్పు ఉంది. మహారాష్ట్ర వైపు 300 మీటర్ల పొడవు ఉంది. ప్రస్తుతం ఈ స్టేషన్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.