వేరుశనగలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
వంటింట్లో ఎక్కువగా అందుబాటులో ఉండే ఈ వేరుశనగ ఎన్నో ప్రధాన వంటకాలలో ఉపయోగపడుతుంది. దీని నుంచి తీసే నూనె మరింత ప్రధానంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల గుండె జబ్బులు కూడా 20శాతం తగ్గుతాయని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. ఇక వేరుశనగ వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గాల్ స్టోన్ నివారిస్తుంది: వేరుశనగ మన శరీరం ఆరోగ్యం మెరుగు పరచడానికి బాగా సహాయపడతాయి. ఈ వేరుశనగ పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. అంతేకాకుండా రాళ్లు పెరగకుండా ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది.
డిప్రెషన్ తగ్గిస్తుంది: వేరుశనగలో ఎక్కువగా ఉండే అమినో యాసిడ్స్ మెదడు నాడీ కణాలకు సంబంధించిన కెరోటిన్ ను ఉత్పత్తి చేయడంలో బాగా సహాయపడుతుంది. అంతే కాకుండా మెదడు సక్రమంగా పనిచేయడానికి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: వేరుశనగ లో అధికంగా ఉండే న్యూట్రియంట్స్ ఇవి చెడు కొలెస్ట్రాల్ ను అరికడుతుంది. అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి కూడా బాగా సహాయపడుతుంది.
ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి: వేరుశనగ లో అధికంగా ఉండే క్యాల్షియం, విటమిన్ డి లు శరీరంలో ఎముకలు గట్టిగా ఉండటానికి తమ వంతు సహాయం చేస్తాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని కూడా కొంత వరకు మెరుగు పరుస్తుందని తెలుస్తుంది.
ఎదిగే పిల్లలకు మేలు చేస్తుంది: వేరుశనగలలో అధికంగా ఉండే ప్రోటీన్స్ ఇది ఎదిగే పిల్లలకు ద బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది తినడం వల్ల పిల్లల్లో ఎదుగుదల బాగా ఉంటుంది. అంతేకాకుండా పొట్టలోని పేరుకుపోయే క్యాన్సర్ కారకాలను కూడా అరికడుతుంది.