జగన్ నవరత్నాలకు నిధులు లేనట్టేనా!
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కొత్త దారిలో తీసుకువెళ్లే ఆలోచన చేపట్టాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలకే ప్రజలకు ప్రజా సంక్షేమ పథకాలు అమలులోకి తీసుకు వచ్చాడు.
ఇదే నేపథ్యంలో నవరత్నాల వర్షం కూడా కురిపించాడు. జగన్ అధికారంలోకి రావడం, పథకాలు అమలు లోకి రావడం అలా.. జరిగిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 90 శాతం హామీలు నెరవేర్చమని సీఎంతో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ పథకాలు విడుదల చేయడానికి నిధులు లేవు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా..
జగన్ ఈ రెండున్నర ఏళ్లలో సంక్షేమ పథకాలు వరుసగా అమలు చేస్తూనే ఉన్నాడు. దీనికోసం రాష్ట్రం ఎక్కువ అప్పులు చేస్తుందన్న సంగతి వాస్తవమే. రాష్ట్ర ఆదాయం కూడా తగ్గుతుంది. ఖర్చు నీరై పారుతుంది. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది. కాబట్టి పథకాల మళ్ళీ అదే విధంగా అమలు చేయాలి. కానీ ప్రభుత్వం దగ్గర నిధులు లేవని తెలుస్తోంది.
ప్రస్తుతం పథకాలు అమలుకై నిధుల కోసం ఎదురుచూస్తుంది. ప్రతి సంవత్సరం జనవరిలో ఇస్తున్న అమ్మఒడి జూన్ కు పోస్ట్ పోన్ అయ్యింది. అదే జనవరి నెలలో ఇవ్వాల్సిన ఈబీసీ నేస్తానికి కూడా వాయిదా కంచె పడింది. 650 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నా ఈ పథకాన్ని కర్నూలు జిల్లాలో సీఎం జగన్ స్వయంగా ప్రారంభించాల్సి ఉన్నా పూర్తిగా వాయిదా బాట పట్టింది.