కొబ్బరికాయలో పువ్వు వస్తే ఏమవుతుందో తెలుసా?
కొబ్బరికాయ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దీనిని శుభ సమయంలో వాడుతారు. దేవుడికి ఈ కొబ్బరి కాయను సమర్పిస్తారు. ఎండు కొబ్బరి బోండా లో నుంచి కొబ్బరి కాయను తీస్తారు. ఇందులో నుంచి వచ్చే నీటిని దేవుడికి అభిషేకించి ఆ ముక్కలను దేవుడికి సమర్పిస్తారు. ఇక ఇందులో కొన్ని కొన్ని సమయాలలో కొబ్బరి పువ్వు కూడా వస్తుంది.
ఇక చాలామంది కొబ్బరి పువ్వు వస్తే శుభం జరుగుతుందని అనుకుంటారు. నిజానికి కొబ్బరి పువ్వు వస్తే మంచే జరుగుతుందని శాస్త్రాలే తెలిపాయి. కొబ్బరి లో పువ్వు వస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని.. అది దైవమిచ్చిన ప్రసాదంగా భావించాలని పండితులు చెబుతారు. అంటే దానివల్ల శుభ ఫలితాలు జరుగుతాయట.
మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు.. అన్ని కొబ్బరికాయల లో పువ్వు ఎందుకు రాదని. నిజానికి అన్ని కొబ్బరికాయలో పువ్వు రాదు. ఎందుకంటే కొబ్బరి కాయ నుంచి కొబ్బరి మొక్క మొలకెత్తి తేనే పువ్వు తయారవుతుంది. అందుకే ఎండిపోయిన కొబ్బరి బోండాలని పాతుతారు. వాటికి పిలకలు రాగానే వాటిని బయటకు తీసి బోండా లోని కొబ్బరికాయలను వేరు చేస్తారు. ఆ కొబ్బరికాయ పగల కొడితే అప్పుడు కొబ్బరికాయలో పువ్వులు కనిపిస్తాయి.
ఆ పువ్వు మెత్తగా ఉంటుంది. రుచికి తియ్యగా ఉంటుంది. అలా మనం మార్కెట్ లో తీసుకున్న కొబ్బరికాయలో పువ్వుతో వచ్చే కొబ్బరికాయలు కూడా వస్తుంటాయి. సైంటిఫిక్ గా దీనికి ఇటువంటి రీజన్ ఉన్నా కూడా శాస్త్రీయపరంగా పువ్వు వస్తే మాత్రం మంచి జరుగుతుందని పండితుల నమ్మకం.