ఓటీఎస్​ ఇది నమ్మినవారికి లాభం.. లేకపోతే నష్టం అంతే- పెద్దిరెడ్డి

ఓటీఎస్ పద్దతి ద్వారా పేదలకు మంచి చేయాలని జగన్ చూస్తుంటే.. ప్రతిపక్షాలు కావాలనే అడ్డుపడుతున్నాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఓటీఎస్​పై ప్రతిపక్షం, వారికి అనుకూలంగా ఉన్న మీడియా అసత్య ప్రచారం చేస్తూ.. ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. అందరికీ లబ్ది చేకూరాలనే ఆలోచనతోనే జగన్ ఓటీఎస్​ను తీసుకొచ్చారని.. దీని ద్వారా పట్టా ఇచ్చి ఇళ్లకు శాశ్వత హక్కు కల్పిస్తామని.. తద్వారా.. ఆ పట్టా తాకట్టు పెట్టుకోవండతో పాటు, రుణం తీసుకునేందుకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు.

minister-peddy-reddy-fires-on-tdp-leaders-ots-dharna

రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం ఈ పట్టాను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తుందని.. బలవంతంగా ఎవ్వరినీ ఈ ఓటీఎస్​ను చేయించుకోమని చెప్పట్లేదని.. స్వచ్ఛందంగా వచ్చినవారికే ఈ లబ్దిని చేకూరుస్తామని అన్నారు. వడ్డీ, లోను, మాఫీ చేస్తూ ఓటీఎస్ తెచ్చామని అన్నారు. పట్టణాల్లో దీనిపై అవగాహన ఉండటంతో స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని..  పల్లెల్లో అవగాహన లోపాన్ని ప్రతిపక్ష పార్టీ నాయకులు వాడుకుంటున్నాయని అన్నారు.

ఒక అబద్దాన్ని 10 సార్లు చెబితే అది నిజమని అందరూ నమ్మేస్తారు. అలాగే.. అబద్దాలు నమ్మితే నష్టం తప్ప లాభం ఉండదు.. 2014లో కూడా రుణమాఫీ చేస్తామని చంద్రబాబు మహిళలకు చెప్పారు. అవి అలాగే ఉండిపోయి.. ఇప్పుడు 25 వేల కోట్లు అయ్యాయ్​. ఆసరా కింద వైసీపీ సర్కార్ ఆ రుణాలు దశలవారీగా చెల్లిస్తున్నారు. అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *