సోదరి సాయంతో యూట్యూబ్ వీడియో చూసి భార్యకు ప్రసవం చేసిన భర్త… స్టోరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ప్రస్తుతం కాలంలో మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీని మంచిగా ఉపయోగించేవారు ఉన్నారు. ఆ టెక్నాలజీ కారణంగా ఇబ్బందుల్లో పడి ప్రాణాలు కోల్పోయేవాళ్లు ఉన్నారు. కానీ ఇప్పుడు చదవబోయే స్టోరీలో ఉన్న వాళ్ళని మాత్రం పిచ్చి వాళ్ళు అనాలో, ఏం అనాలో ఆర్డక్ కావట్లేదు. తమిళనాడులోని నేమిలి జిల్లా పణపాకం గ్రామానికి చెందిన లోకనాథన్ (32) చిరు వ్యాపారి. స్థానికంగా చిల్లర కొట్టు నడుపుతుంటాడు. అతని భార్య గోమతి (28) గర్భిణి. నెలలు నిండిన ఆమెకు లెక్క ప్రకారం ఈనెల 13నే ప్రసవం కావాల్సి ఉంది. కానీ ఐదు రోజులు ఆలస్యంగా ఈనెల 18న పురిటి నొప్పులు వచ్చాయి. భర్తకు ఫోన్ చేయగా ఇంటికి వచ్చిన లోకనాథన్ తన సోదరి జ్యోతి సహాయంతో యూట్యూబ్ లో మహిళల లేబర్ డెలివరీ వీడియోలు చూస్తూ ఇక్కడ అదే విధంగా వ్యవహరించారు.
దాదాపు గంటసేపు ఇబ్బంది పడ్డ గోమతి చివరికి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ పుట్టే సమయానికే ఆ శిశువు చనిపోయింది. కాన్పు తర్వాత గోమతికి విపరీతంగా రక్తస్రావం అయి స్పృహ కోల్పోయింది. అప్పుడు లోకనాథన్ తన భార్యను స్థానిక ప్రైమరీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కండిషన్ సీరియస్ గా ఉండటంతో గోమతిని వేలూరు జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైద్య, పోలీస్ అధికారులు విచారణ చేపట్టారు. ఇక్కడ ఆశ్చర్య పడాల్సిన విషయం ఏంటంటే నవజాత శిశువు మరణానికి, గోమతి ప్రాణాపాయానికి కారకుడైన లోకనాథన్ పై కేసు పెట్టాలని డిమాండ్లు వచ్చినా, పోలీసులు మాత్రం ఏమి చేయలేకపోతున్నారు.
ఇంట్లోనే ప్రసవం జరగాలన్నది గోమతి ఇష్టపూర్తిగా తీసుకున్న నిర్ణయమని, ఆస్పత్రికి పోదామని బతిమాలినా ఆమె వినిపించుకోలేదని, గోమతి ఇష్టప్రకారమే అంతా జరిగిందని లోకనాథన్, అతని సోదరి జ్యోతి పోలీసులకు చెప్పుకొచ్చారు. కలకలం రేపిన ఈ ఘటనపై కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే నేత డాక్టర్ అన్బుమణి రాందాస్ కూడా స్పందించి వారిపై మండిపడ్డారు.