టీడీపీలో మాజీ మంత్రి చేరిక.. ఎంత వరకు నిజం?
ఏపీ రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీలోకి మాజీ మంత్రి రఘువీరారెడ్డి చేరబోచున్నట్లు సామాజిక మాధ్యమాల్లోవార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు మరికొందరు రఘువీరా చేరికపై బలమైన నమ్మకంతో చెబుతున్నారు. త్వరలోనే పచ్చ కండువా కప్పుకుంటారని అంటున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్లోఏకంగా రఘువీరానే ట్యాగ్ చేసి మరి పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే, ఆయన నుంచి ఈ విషయంపై ఎటువంంటి స్పందన రాలేదు.
దీంతో పాటు మరో చర్చ కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఆయన తెదేపాలో చేరితే.. ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది. కళ్యాణ దుర్గం నుంచే పోటీ చేస్తారని నేతలు మాట్లాడుకుంటున్నారు. అయతే, ఆ నియోజకవర్గంలో ఇప్పటికే ఇద్దరు నేతలు తమకంటే తమకు టికెట్ కావాలని పోటీ పడుతున్ననారు. ఇప్పుడు వాళ్లను కాదని బాబు రఘువీరాను కూర్చొబెడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు, అసలు ఆయన పార్టీ మారకముందే.. ఈ రచ్చ ఏంటని మరికొందరు భావిస్తున్నారు. ఆయనే స్వయంగా ప్రకటించే వరకు ఏదీ నిజం కాదని అంటున్నారు.
కాగా, ఏపీ రాజకీయాల్లో సీనియర్‌నేతగా ఉంటున్న రఘువీరారెడ్డి.. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మంత్రగా వ్యవహరించారు. ఆ తర్వాత ఏపీసీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. పదవి నుంచి తొలగిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ.. సొంత ఊరిలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.