వైసీపీ నాయకుల మధ్య వర్గపోరు.. అవంతి vs కన్నబాబు
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి ఓ వైపు ప్రజల కోస ఎన్నో కార్యక్రమాలు చేపడుతూనే.. మరోవైపు సామాన్య ప్రజలపై భారం పడేలా నిత్యవసర వస్తువులపైనా ధరలు పెంచుతూ చుక్కలు చూపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కరోనా సంక్షోభం పేరుతోనో, అభివృద్ధి పనులతోనో, బడ్జెట్ లోపం అనే నెపమో. ఇలా కారణం ఏదైనా కావచ్చు.. జగన్ పాలనలో ప్రజలు మండుటెండలో చెప్పులు లేకుండా నిలబడితే ఎలా మండుతుందో.. అంతలా వారి హృదయాలు మండిపోతున్నాయని క్లియర్‌గా అర్థమవుతోంది. సరే, ఇదంతా పక్కన పెడితే..
ఎన్నికల్లో నమ్మి ఓటేసి గెలిపించిన నాయకులు, ఎమ్మెల్లే, ఎంపీలు.. నిబద్దతతో మెలుగుతూ చట్టసభల్లో ప్రజల సమస్యలను పరిష్కరించాలి. కానీ, అసెంబ్లీ వేదికగా ఇన్నేళ్ల సమావేశంలో ప్రతిపక్ష, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధాలు.. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోడాలే తప్ప.. విలువైన సభా సమయాన్ని ప్రజల కోసం కేటాయించిన సందర్భాలు చాలా తక్కువ. సరే కనీసం వారికైనా ఒకరిపై ఒకరికి అభిమానముంటుందని అనుకుంటే.. ఇటీవలే జరిగిన కొన్ని సంఘటనలతో తోటి నాయకుల మధ్యే సన్నిహిత్యం లోపించినట్లు కనిపిస్తోంది.
తాజాగా, విశాఖ జిల్లాలో జరిగిన ఘటనతో వైసీపీలో వర్గపోలు తారస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే కన్నబాబు రాజుల మధ్య మాటల యుద్ధం జరిగింది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి అవంతి, కన్నబాబు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మంత్రి అవంతి శ్రీనివాస్ వేదికపైకిZP వైస్ ఛైర్మన్ లను స్వాగతించారు. అయితే, మధ్యలో కన్నబాబు పైకి లేచి.. ప్రొటోకాల్‌లో వాళ్లను స్టేజ్‌పైకి పిలివాలని లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన తర్వాత అభ్యతరం ఉంటే మాట్లాడాలని మంత్రి అవంతి ఫైర్ అయ్యారు. ప్రోటోకాల్‌ను ఫాలో అవ్వకుంటే.. తాను ఈ సమావేశం నుంచి వెళ్లిపోతానని కన్నబాబు చెప్పగా.. పక్కనే ఉన్న అధికారులు కూడా వివరించడంతో.. మంత్రి అవంతి వెనక్కి తగ్గారు.