Viral News: పెట్రోల్ బంక్ లలో ప్రజలకు 6 సేవలను ఉచితంగా అందించాలని తెలుసా… అవేంటో మీకోసం 

పెట్రోల్ బంక్ Viral News: పెట్రోల్ బంక్స్ లను కేవలం  పెట్రోల్, డీజిల్  కొట్టించుకోవడానికి మాత్రమే వినియోగిస్తారని అనుకుంటున్నారా. అది నిజమే… కానీ పెట్రోల్ బంక్ లో భారత పౌరులకు ఆరు సేవలను ఉచితంగా అందించాలని రూల్ ఉన్న సంగతి మీకు తెలుసా. అవును … ఈ ఆరు సేవలను ఉచితంగా అందించేటట్లు అయితేనే వారికి పెట్రోల్ బంక్ ను నిర్వహించుకోవడానికి అనుమతులు ఇస్తారు. లేకుంటే బంక్ నిర్వహించడానికి కూడా అనుమతి ఉండదట. ఏ కారణంగా అయినా పెట్రోల్ బంక్స్ ఈ ఆరు సేవలను పౌరులకు అందించకపోతే… తక్షణమే భారత పౌరులు సదరు పెట్రోల్ బంక్ పైన ఫిర్యాదు చేయవచ్చట. ఆ ఆరు సేవలు ఏంటో మీకోసం…

interesting details about petrol bunks facilities for public

  1. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ బంక్స్ విధిగా మూత్ర శాలలను నిర్వహించాలి. మనం చెల్లించే లీటర్ పెట్రోల్ ఖరీదులో 4 నుంచి 8 పైస‌లు మూత్ర శాలలు, మరుగుదొడ్ల నిర్వహణ కోసం కేటాయించబడుతోంది.
  2. పెట్రోల్ బంక్ కు వచ్చేవారిలో అవసరం అయిన వారికి ఉచితంగా తాగు నీటిని అందించాలి. ఇందుకోసమే బంక్ డీలర్ ఆర్వో యంత్రం, వాట‌ర్ కనెక్ష‌న్ లను కూడా తీసుకోవాలి.
  3. బంక్ కి వచ్చే వాహనాలలో ఉచితంగా గాలి నింపాలి. ఇందుకోసం ప్రత్యేకంగా చార్జీలు వసూలు చేయరాదు.
  4. పెట్రోల్ బంక్స్ సమీపంలో ఎవరికైనా గాయాలు అయితే… ప్రధమ చికిత్స చేయాలి. ఇందుకోసం అవసరమైన కిట్ ను కూడా పెట్రోల్ బంక్ లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి.
  5. పెట్రోల్, డీజీల్ నాణ్యతా ప్రమాణాలను ఏ వినియోగదారుడు అడిగినా చెప్పాలి. వారికి ఆ హక్కు కచ్చితంగా ఉంటుంది.
  6.  అత్యవసర పరిస్థితులలో ప్రజలకు పెట్రోల్ బంక్ నుంచి ఫోన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *