AP Politics: ఏపీ గవర్నర్​తో సీఎం జగన్ భేటీ.. ఏం చర్చించారంటే?

AP Politics: ఆంధ్రప్రదేశ్ గవర్నర్​ బిశ్వభూషణ్  హరిచందన్​తో ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి తాజాగా భేటీ అయ్యారు. బుధవారం ఆయన భార్య వైఎస్​ భారితితో కలిసి రాజన్​భన్​కు వెళ్లిన జగన్.. గవర్నరు దంపతులు బిశ్వభూషణ్​, సుప్రవ  హరిచందన్​లను పరామర్శించారు.

ap-cm-jagan-meet-governer-vishwabhooshan-harichandan

ఇటీవలే కోవిడ్​తో పాటు పలు అనారోగ్య సమస్యలతో గవర్నర్ దంపతులు హైదరాబాద్​లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే రెండు సార్లు చికిత్స తీసుకున్నారు. అయితే, తాజాగా వీరిద్దరు కోలుకుని.. రాజ్​భవన్​కు తిరిగొచ్చారు. ఈ క్రమంలోనేన గవర్నరు దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి ఏపీ సీఎం జగన్​ పరామర్శించారు. సతీమసేతంగా వెళ్లిన ఆయన.. కాసేపు గవర్నరుతో కలిసి ముచ్చటించి.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

కొంతకాలం విరామం తీసుకుని పూర్తిగా కోలుకోవాలని సూచించారు. కాగా, ప్రస్తుతం తను పూర్తిగా కోలుకున్నట్లు జగన్​కు గవర్నర్ తెలిపారు.  విధులను కూడా సాధారణంగానే నిర్వహించగలుగుతున్నట్లు గవర్నర్​ జగన్​కు వివరించారు. సుమారు అరగంట పాటు వీరి భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో రాజకీయ అంశాలతో పాటు, పలు కీలక విషయాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఏపీలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలకు భారీ నష్టం వాటిల్లింది. పంట, ఆస్తి నష్టంతో పాటు పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పటికీ పలు చోట్ల ఆ వరద ప్రభావం అలాగే ఉంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు, అమలు చేయాల్సిన పథకాలు, ఇటీవలే ముంచెత్తిన వరదల ప్రభావం తదితర అంశాలపైనా చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్సీ తలశిల రఘురామ్​తో పాటు పలువురు అధికారులు కూడా గవర్నర్​ను కలిసేందుకు వచ్చారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *