శీతాకాలంలో వచ్చే వ్యాధులకు దూరంగా ఉండాలంటే ఈ”టీ” లు తాగాల్సిందే!
సాధారణంగా వాతావరణంలో మార్పులకు అనుగుణంగా ఎన్నో రకాల వ్యాధులు మనల్ని వెంటాడుతుంటాయి. ఈ క్రమంలోనే ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన ఆహార పదార్థాలను కూడా మార్చుకోవలసి ఉంటుంది. శీతాకాలం మొదలవడంతో ఎన్నో రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే జలుబు దగ్గు వంటి సమస్యలు అధికం కావడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే కొన్ని రకాల టీ లు తాగటం వల్ల శీతాకాలంలో వచ్చే వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
మన వంట గదిలో లభించే మసాలా దినుసులలో పసుపు ఎంతో కీలకమైనవి. పసుపులో ఎన్నో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడటం కాకుండా వ్యాధులను కలిగించే వ్యాధి కారకాల పై దాడి చేస్తాయి. కాస్త నిమ్మరసం తేనె పసుపు కలిపి తయారుచేసుకున్న ఈ పసుపు టీ తాగడం వల్ల దగ్గు జలుబు సమస్య నుంచి బయట పడవచ్చు. అల్లంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అల్లంలో ఉండే యాంటి మైక్రోబియల్ గుణాలున్నాయి.ఇవి మన శరీరంలో ఏర్పడిన ఫ్రీరాడికల్స్ ను తొలగించడానికి దోహదపడతాయి.
అలాగే ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి బ్లాక్ టీ, మందార టీ, గ్రీన్ టీ, లెమన్ గ్రాస్ టీ, పుదీనా టీ వంటి దివ్య ఔషధాలు కలిగినటువంటి పానీయాలు తాగడం వల్ల చలికాలంలో వచ్చేటటువంటి ఏ విధమైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడమే కాకుండా ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా దోహదపడతాయి. కనుక చలికాలంలో రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహార పదార్థాలను సేవించడం ఎంతో ముఖ్యం.