150 దేశాలను వణికించా..కేసీఆర్ కు భయపడను : కేఏ పాల్

తనపై కేసీఆర్, కేటీఆర్ దాడి చేయించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ ఆరోపించారు. డీజీపీకి నిన్నటి నుంచి కాల్ చేస్తున్నా స్పందించడం లేదని తెలిపారు. ఘటనా ప్రదేశంలో రైతులే లేరని, తానెక్కడ దూషించానని ప్రశ్నించారు. పోలీసులు నన్ను కాలర్ పట్టుకొని లాక్కొని ఎత్తుకెళ్లారని మండిపడ్డారు. తాను చేసిన తప్పు ఏంటని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడినందుకు నాపై దాడి చేశారా అని మండిపడ్డారు. తాను ఆంధ్రావాడిని అయితే.. కేసీఆర్ కూడా ఆంధ్రావారే అన్నారు. డీజీపీని కలిస్తే తప్పేంటి అని, రైతుల దగ్గరకు వెళ్తే తప్పేంటి అని ప్రశ్నించారు.

తెలంగాణ రైతుల కష్టాలు పట్టని మీరు తెలంగాణ ద్రోహులు కేసీఆర్ పార్టీ వాళ్లు అని విమర్శించారు. సిరిసిల్ల మహారాష్ట్రలో ఉందా.. కర్ణాటకలో ఉందా? అని నిలదీశారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని మండిపడ్డారు. 150 దేశాలను వణికించా.. కేసీఆర్, కేటీఆర్ కు భయపడను అని హెచ్చరించారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. అరగంటలో 4 సార్లు కేంద్రమంత్రులతో మాట్లాడానని,  తనపై దాడి కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు.

తానేమీ అరెస్ట్ లకు, దాడులకు భయపడనని స్పష్టం చేశారు. అయితే నిన్న సిద్దిపేటలోని జక్కాపూర్ లో జిల్లెల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాల్ మాట్లాడుతుండగా ఉన్న ఫలంగా వచ్చి చంప చెల్లుమనిపించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు పాల్ వెళ్లారు. డీఎస్పీ ఎదుటే ఓ యువకుడు పాల్ పై చేయి చేసుకున్నారు. యువకున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *