లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 4 నెలల్లో మూడు లక్షల రూపాయలు.. ఊహించని లాభం…?
March 1, 2021
మనలో చాలామంది డబ్బును సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే అవగాహన మాత్రం ఉండదు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టటం ఉత్తమం. ప్రస్తుతం ఫార్మా, ఎఫ్.ఎం.సీ.జీ కంపెనీల స్టాక్స్ పరుగులు పెడుతున్నాయి. ల్యారస్ ల్యాబ్ షేర్ ధర గడిచిన 120 రోజుల్లో 217 శాతం వృద్ధి సాధించింది.
నాలుగు నెలల కిందట లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు మూడు లక్షల 17 వేల రూపాయలు సొంతమయ్యేవి. మిడ్ ఫార్మా కంపెనీ అయిన లారస్ ల్యాబ్స్ కంపెనీ విలువ 11,000 కోట్ల రూపాయలు. ఈ స్టాక్ ధర భవిష్యత్తులో 1215 రూపాయలకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీ వాల్యుయేషన్స్, ఆదాయం బాగుండటం వల్లే ఈ స్థాయిలో ఆదాయం సమకూరుతోందని తెలుస్తోంది.