పవన్ కళ్యాణ్ అభిమానులు ఊరకే ఉండరు కదా!!

తమ కథానాయకుణ్ణి ఎప్పుడూ అత్యున్నత స్థానంలో ఉంచే పవన్ కళ్యాణ్ అభిమానుల ‘పవనిజం’ ఎలాంటిదో తెలిసిందే. గతంలో 50 రూపాయల నోట్లపై తమ నాయకున్ని ఉంచి ఒక 30 సంవత్సరాల క్రితం ఈ వ్యక్తి ఉండుంటే ఇప్పుడు మన నోట్లు ఇలా ఉండేవంటూ సోషల్ మీడియాలో విరివిగా షేర్లు చేసారు. దీని పై కొంతమంది తెలంగాణ  లాయర్లు గతంలో హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. విరివిగా ట్రెండ్ అవుతుండడంతో దీనిపై ఎలా చర్యలు తీసుకోవాలో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు మరో 30 ఏళ్ల తర్వాత మన 2000 రూపాయలు ఇలా ఉంటాయంటూ జనసేనాని ఫోటోని ఉంచి సోషల్ మీడియా లో విరివిగా షేర్లు చేస్తున్నారు. దీన్ని చూసిన అనేకమంది ఊరకనే ఉండరు కదా ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు అని అంటున్నారు.
 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *