దీపికా ఏంటీ డ్రెస్ అంటున్న బ్రిటీష్ వారు, దీపిక డ్రెస్ సూపర్ అంటున్న భారతీయులు
November 8, 2016
ఇటీవల హాలీవుడ్ లో ప్రవేశించి తన సత్తా చూపాలని తహతహలాడుతున్న బాలీవుడ్ నటి దీపికా పదుకొనెకు యూరప్ లో జరుగుతున్న ఎం.టి.వి. మ్యూజిక్ అవార్డుల వేడుకలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ఫ్యాషన్ డిజైనర్లు వస్తారు. దీనికి హాజరైన దీపిక వస్త్రధారణ విమర్శల పాలైంది. ఆమె ధరించుకు వచ్చిన చిత్తడి ఆకుపక్క (పాచి) రంగు డ్రెస్ అక్కడి ఫాషన్ డిజైనర్లకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో వారు హాలీవుడ్ లో తన ప్రతాపాన్ని చూపుదామని అనుకుంటున్న దీపిక పై ‘బాలీవుడ్ బ్లండర్’ అంటూ బ్రిటీష్ పత్రిక డైలీ మెయిల్ లో కథనాలు వ్రాసారు. ‘దీపిక అందగత్తె కావచ్చు. కానీ పాచి రంగులో ఉన్న ఆమె దుస్తులు, పైగా ఆ స్కర్ట్ ఆమె అందానికి ఏమాత్రం సరిపోవు’ అని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మన దేశంలో నెటిజన్లు సోషల్ మీడియా లో ఈ ఉదంతంపై తీవ్రంగా స్పందించారు. భారతీయ అందాన్ని అక్కసుతో కావాలనే బ్రిటిష్ మీడియా విమర్శిస్తోంది, దీపిక అందానికి, ఆమె దుస్తులకు ఏమైంది, చాలా చక్కగా ఉంది అంటూ కితాబిస్తున్నారు. హాలీవుడ్ లో దీపిక కేవలం తన అందం ద్వారానే కాకుండా నటన ద్వారా కూడా ప్రతిభ చూపగలదని భారతీయ యువత దీపికా కు తమ మద్దతు తెలుపుతున్నారు.