దివ్యాంగునికి ట్రై సైకిల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
February 18, 2017
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో 39వ డివిజన్ కు చెందిన కనగలూరు ప్రసాద్ అనే దివ్యాంగునికి ట్రై సైకిల్ ని అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ విధివశాత్తు దివ్యాంగులుగా మారిన వారికి అండగా నిలిచి చేయూతను ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని తెలిపారు. వారికోసం ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు సక్రమంగా వారికి అందేలా చూడాలన్నారు. వారి సహాయార్ధం ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి నిత్యం సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గత రెండు సంవత్సరాలుగా సుమారు 400 మంది దివ్యాంగులకు ప్రభుత్వ అధికారులు, దాతలు, స్నేహితుల సహకారంతో వివిధ రకాలుగా తోడ్పాటు అందించానని, భవిష్యత్తులో సైతం దివ్యాంగుల సమగ్రాభివృద్ధికి పాటు పడతానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కాకుటూరు లక్ష్మి సునంద తదితరులు పాల్గొన్నారు.